ఫిఫా నాకౌట్ పోటీలు- 24 ఏళ్ల తర్వాత క్వార్టర్స్ లోకి స్వీడెన్

ఫిఫా నాకౌట్ పోటీల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీలో స్వీడెన్ జయభేరి మోగించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మంగళవారం (జులై-3) జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0 గోల్‌ తేడాతో స్వీడెన్ గెలిచి క్వార్టర్స్‌లోకి

Webdunia
బుధవారం, 4 జులై 2018 (09:32 IST)
ఫిఫా నాకౌట్ పోటీల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీలో స్వీడెన్ జయభేరి మోగించింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మంగళవారం (జులై-3) జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0 గోల్‌ తేడాతో స్వీడెన్ గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. దీంతో 24 ఏళ్ల తర్వాత మొదటి సారిగా స్వీడన్ క్వార్టర్స్ ఫైనల్‌కి చేరుకుంది. ఆద్యంతం రెండు జట్లు గోల్ చేసేందుకు పోటీపడినా ఫలితం లేకుండా పోయింది. 
 
హాఫ్‌ టైమ్ గడిచేసరికి స్కోరు 0-0గా ఉంది. మొదటి  28 నిమిషాల్లో స్వీడన్‌ ఆటగాడు మార్కస్‌ బెర్గ్‌ 13 షాట్లు కొట్టి గోల్‌కోసం ప్రయత్నించాడు. బ్రేక్ తర్వాత ఇరు జట్లు పోటాపోటీగా సాగాయి. ఆట 66వ నిమిషంలో స్వీడన్‌ గోల్‌ చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్వీడన్‌ మిడ్‌ ఫీల్డర్‌ టయ్‌వోనిన్‌ అందించిన పాస్‌ను ఎమిల్‌ ఫోర్స్‌బెర్గ్‌ గోల్‌ చేశాడు.
 
తద్వారా ప్రపంచకప్‌ టోర్నీల్లో ఎమిల్‌‌కిది మొదటి గోల్‌. నిర్ణీత 90 నిమిషాలు పూర్తయ్యే సరికి 1-0తో స్వీడన్‌ ఆధిక్యంలో ఉంది. అదనపు ఏడు  నిమిషాల ఆటలో స్వీట్జర్లాండ్‌ ఆటగాడు మైకేల్‌ లాంగ్‌ రెడ్‌ కార్డ్‌ పొందడంతో గ్రౌండ్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఆటలో స్వీడన్‌ ఒక ఎల్లో కార్డు పొందగా, స్విట్జర్లాండ్‌ రెండు ఎల్లో కార్డులు, ఒక రెడ్‌ కార్డ్‌ పొందింది. ఇప్పటివరకు ఏడు సార్లు నాకౌట్లోకి ప్రవేశించినప్పటికి స్విట్జర్లాండ్‌ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Put Chutney యూ ట్యూబర్ నుంచి విజయ్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా రాజ్ మోహన్

వట సావిత్ర వ్రతం నాడు దీపాలు వెలిగిస్తుండగా మర్రిచెట్టుకు అంటుకున్న నిప్పు, వీడియో

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments