Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిపా వరల్డ్ కప్ 2018 : రొనాల్డో హ్యాట్రిక్‌ గోల్స్‌.. మ్యాచ్ డ్రా

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా స్పెయిన్ - పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హురాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ కెప్టెన్, సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన స్టామినాను మరోమారు చూపించా

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (13:28 IST)
ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీల్లో భాగంగా స్పెయిన్ - పోర్చుగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హురాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ కెప్టెన్, సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన స్టామినాను మరోమారు చూపించాడు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
 
స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు మేటి ఆటను ప్రదర్శించాయి. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రొనాల్డో.. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ రొనాల్డో.. ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు.
 
మ్యాచ్ తొలి అర్థభాగంలో పోర్చుగల్ దూకుడుగా కనిపించింది. కానీ ఆ తర్వాత స్పెయిన్ ఆటగాళ్ల జోరుకు ఆ ఆధిపత్యం తగ్గిపోయింది. స్పెయిన్‌ ఆటగాడు డీగో కోస్టా 24వ నిమిషంలో గోల్‌ చేయగా స్కోర్స్‌ సమం అయ్యాయి. ఆ తర్వాత 44వ నిమిషంలో రొనాల్డో మరో గోల్‌ సాధించాడు. ఆ వెంటనే కోస్టా 55వ నిమిషంలో మరో గోల్స్‌ సాధించాడు. ఆ టీమ్‌కు చెందిన నాచో కూడా 58వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. 
 
కీలకమైన సెకండ్ హాఫ్‌లోనూ రోనాల్డో తన సత్తా చాటాడు. ఇక మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో.. రొనాల్డో చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో థ్రిల్ పుట్టించాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్‌తో రొనాల్డో గోల్ చేసి స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments