Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ గురించి శ్రీకృష్ణుడు చెప్పిందేమిటి?

అన్నాచెల్లెళ్ళు-అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. సోదరులు చేతికి రాఖీ కట్టి వారు చేపట్టే ప్రతి సత్కార్యం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది.

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (15:01 IST)
అన్నాచెల్లెళ్ళు-అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. సోదరులు చేతికి రాఖీ కట్టి వారు చేపట్టే ప్రతి సత్కార్యం విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది. అన్నదమ్ములు లేని వారు కూడ తాము సోదరులుగా భావించుకునే వ్యక్తులకు రాఖీని కట్టి ఈ పండుగను చేసుకుంటారు. ఆ క్షణంలో చెల్లిపోయేది కాదు. జీవితాంతం నిలిచిపోయేది. అన్నయ్య కలలు పండాలన్నా... చెల్లాయి మనస్సు నిండాలన్నా అది స్వచ్ఛమైన రక్షాబంధన్‌కే సాధ్యం. శ్రావణమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున వచ్చే పవిత్ర పర్వదినాన్ని శ్రావణ పౌర్ణమి అంటారు. 
 
ఆ రోజు రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రక్షికా పూర్ణిమ, రఖ్రీ సాలునో, సారవీ పూర్ణిమ, నారికేళ పూర్ణిమ, నార్లీ పున్నమి ఇలా వివిధ పేర్లతో ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా  ప్రేత, పిశాచ బాధ, దుష్ట శక్తుల బాధలుండవని, అనారోగ్యం, అశుభాలు ఏమాత్రం దరిచేరవని కృష్ణుడు చెప్తాడు.
 
ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా కృష్ణుడు వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. 
 
మహాబలవంతుడు, దానశీలుడు, రాక్షస రాజైన బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తిలో బంధించాడు. అంతటి విష్ణు శక్తి కలిగిన రక్షాబంధన్‌ను నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను. ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది... రాఖీని కడుతూ.. అన్నదమ్ముల నోటికి తీపిని అందిస్తారు అన్నదమ్ములు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని వేడుకుంటూ ఈ రాఖీ కడతారు. మరి అందరికీ రాఖీ పున్నమి శుభాకాంక్షలు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

లిఫ్టులో కిరాతకంగా వ్యక్తి హత్య.. బ్యాంకు భవనంలో దారుణం!

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments