Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వారం ఏ రంగు దుస్తులు ధరించాలి…?

ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు.

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2016 (13:38 IST)
ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు.
 
ఆదివారం: ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి. కొన్ని రంగులు మనకు నచ్చుతుంటాయి. అనాయాసంగా ఆయా రంగుల పట్ల ఆకర్షితులమవుతుంటాము. దీనినే ” కలర్ సైన్స్ ” అంటారు. కాని జ్యోతిష్యాన్ని నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.
 
సోమవారం : సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.
మంగళవారం : మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు. 
 
బుధవారం : వారంలో మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించండి. 
గురువారం : గురువారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. 
 
శుక్రవారం : శుక్రవారం దేవీ(అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి. కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.
శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments