బలిచక్రవర్తికి శ్రీమహాలక్ష్మీదేవి రాఖీ కట్టిందట.. ఎందుకు?

రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలవబడుతున్న ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమిగా లేదా జంద్యాల పౌర్ణమిగా పిలుస్తారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు.

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (15:03 IST)
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలవబడుతున్న ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమిగా లేదా జంద్యాల పౌర్ణమిగా పిలుస్తారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం. సోదరి తన సోదురుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే రాఖీ.
 
సోదరసోదరీమణుల మధ్య కూడా పండుగను సృష్టించడం మన సంస్కృతిదే. శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. అప్పుడు శ్రీమహాలక్ష్మీ వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకెళ్తుతుంది. ఇంకా చెప్పాలంటే విద్యార్థుల చేత జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా రాఖీలు కట్టిస్తారు. ఎందుకంటే వాళ్లలో మార్పు కోసం. 
 
ఒకసారి రాణి కర్ణావతి శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు ఢిల్లీపాదుషాకు రాశీ పంపంగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట్లో అన్నం తిని ఆమెకు కానుకలు ఇచ్చి వెళతాడు. అంతేకాకుండా గ్రీకు దేశస్తుడు అలెగ్జాండర్ భార్య భారత దేశమును పరిపాలిస్తున్న రాజైన పురుషోత్తమునికి కూడా రాఖీ కట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల సంఘం ప్రతిష్ట దిగజారిపోతోంది.. బీహార్ ఫలితాలు అందరికీ ఓ పాఠం : సీఎం స్టాలిన్

భార్య కేసు పెట్టిందని మనస్తాపంతో టెక్కీ భర్త ఆత్మహత్య

వైజాగ్‌ను మరో గోవా చేయాలి... భర్త పెగ్గేస్తే భార్య ఐస్ క్రీమ్ తినేలా చూడాలి : సీహెచ్ అయ్యన్నపాత్రుడు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

అన్నీ చూడండి

లేటెస్ట్

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?

తర్వాతి కథనం
Show comments