రుద్రాక్ష మాలను ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

రుద్రాక్ష మాల సాక్షాత్తు శివ స్వరూపమని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఈ రుద్రాక్ష మాలను ధరించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని మహర్షుల మాట. అందువలన శివభక్తులు మెడలలో తప్పకుండా రుద్రాక్ష మాలలను ధర

శుక్రవారం, 3 ఆగస్టు 2018 (12:11 IST)
రుద్రాక్ష మాల సాక్షాత్తు శివ స్వరూపమని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడుతోంది. ఈ రుద్రాక్ష మాలను ధరించడం వలన విశేషమైన ఫలితం లభిస్తుందని మహర్షుల మాట. అందువలన శివభక్తులు మెడలలో తప్పకుండా రుద్రాక్ష మాలలను ధరిస్తుంటారు. రుద్రాక్ష మాలలు అత్యంత శక్తివంతమైన, పరమ పవిత్రమైనవిగా చెప్పబడుతోంది.
 
రుద్రాక్షమాలతో చేసే జపం వలన పరిపూర్ణమైన ఫలితం లభిస్తుంది. రుద్రాక్షమాలను వేసుకుని పూజలు చేయడం వలన శివుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని మహర్షులు చెబుతున్నారు. రుద్రాక్ష మాలను వేసుకోవడం వలన సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో స్పష్టం చేయబడుతోంది. ఈ మాలలు ధరించిన వారికి దుష్ట శక్తులు దరిచేరవు.
 
అంతేకాకుండా అనారోగ్యాలు, అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. వీటిని వేసుకున్నప్పుడు కలిగే పవిత్రత మరొకటిలో ఉండదు. నియమనిష్టలు పాటిస్తూ రుద్రాక్ష మాల పవిత్రతను కాపాడుతుంటే ధరించిన వారిని అది అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శుక్రవారం (03-08-18) దినఫలాలు - ఆధ్యాత్మిక చింతన....