రాఖీ కట్టేముందు సోదరుడి నుదుట బొట్టు ఎందుకు?

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (01:47 IST)
రాఖీ పౌర్ణమి.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగ. ప్రతీ ఏటా శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజు మన దేశం మొత్తం రాక్షా బంధన్ జరుపుకుంటుంది. సోదరి రాఖీని తన సోదరుడికి కడుతుంది. అయితే.. పౌర్ణమి అంటేనే చంద్రుడు నిండు ప్రకాశంతో వెలుగుతూ కనిపిస్తాడు.

రాఖీ అంటే నిండు ప్రకాశం గత చంద్రుడని అర్థం. అందుకే మనిషి ఆత్మలను చంద్రుడితో పోలుస్తారు. మనిషి ఆత్మలు జనన, మరణ కాలచక్రంలోకి రావడం వల్ల తమకు ఉన్న ప్రకాశం, పవిత్రతను కోల్పోతాయట. అంటే మనిషిగా పుట్టారంటే ఆ ఆత్మకు ప్రకాశం ఉండదు. పవిత్రత ఉండదు. దీంతో మనిషిగా ఉన్నప్పుడే మనిషి ఆత్మను ప్రకాశింపజేయడం కోసం సోదరి రూపంలో దేవుడు ఈ రాఖీని కట్టిస్తాడట.
 
రాఖీ కట్టడానికంటే ముందు సోదరి తన సోదరుడి నుదిటిన బొట్టు పెడుతుంది. మనిషి ఆత్మ నుదిటిన ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సోదరి నిండు పౌర్ణమి నాడు సోదరుడి నుదిటిన బొట్టు పెడితే ఆ ఆత్మ ప్రకాశవంతమై పవిత్రతను సంతరించుకుంటుందట.

అందుకే రాఖీ కట్టేముందు సోదరి తన సోదరుడి నుదుట బొట్టు పెడుతుంది. అనంతరం రాఖీ కట్టి నోరును తీపి చేస్తుంది. నోరును తిపి చేయడం వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉందట. తీపి ఎంత మధురంగా ఉంటుందో.. మనమంతా ఎప్పుడూ మధురమైన మాటలే మాట్లాడాలని.. మన వ్యవహారం కూడా మధురంగా ఉండాలని అనే ఉద్దేశంతోనే నోరు తీపి చేస్తారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

లేటెస్ట్

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments