Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండాకాలం వచ్చేస్తోంది.. చికెన్ వద్దు.. చేపలతో వెరైటీ ఫ్రై మీ కోసం...

ఎండాకాలం వచ్చేస్తోంది. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో చికెన్, మటన్ కంటే చేపలను డైట్‌లో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలు శరీరాన్ని డీ-హైడ్రేషన్ ను

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (14:51 IST)
ఎండాకాలం వచ్చేస్తోంది. మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ కాలంలో చికెన్, మటన్ కంటే చేపలను డైట్‌లో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేపలు శరీరాన్ని డీ-హైడ్రేషన్ నుంచి కాపాడుతాయి.

ముఖ్యంగా సాల్మన్ ఫిష్‌ను వారానికోసారి సమ్మర్లో తీసుకోవడం ద్వారా మోకాళ్ల నొప్పులుండవు. హృద్రోగానికి చేపలు మేలు చేస్తాయి. నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. చేపల్లోని పోషకాలు నిద్రలేమిని దూరం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న చేపలతో గ్రేవీలతో బోర్ కొట్టేస్తే వెరైటీగా ఆవ నూనెతో ఫ్రై చేసి చూడండి.. ఎలా చేయాలంటే..?
 
కావలసిన పదార్థాలు:
చేపలు - అర కేజీ
ఉప్పు, పసుపు- తగినంత 
అల్లం పేస్టు- రెండు స్పూన్లు 
ఆవ నూనె - తగినంత 
ఎండు మిరపకాయలు- నాలుగు 
వేడి నీళ్లు - తగినంత 
పంచదార - అర స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ - అర స్పూన్  
కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు  
 
తయారీ విధానం:
శుభ్రం చేసిన చేప ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించాలి. అల్లం పేస్ట్‌ను కూడా చేప ముక్కలకు పట్టించాలి. అరగంట తర్వాత చేపల మిశ్రమాన్ని పక్కనబెట్టాలి. స్టౌపై బాణలి పెట్టి ఆవనూనె పోసి.. వేడయ్యాక అందులో చేప ముక్కలను సగం వేగాక ప్లేటులోకి తీసుకోవాలి. మిగిలిన ఆవనూనెలో ఎండు మిర్చిని వేపాలి. అల్లం పేస్ట్ ఒక స్పూన్ చేర్చి దోరగా వేపాలి, పసుపు పొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ చేర్చాలి. 
 
అందులో వేడి నీటిని చేర్చి.. మసాలాను బాగా తెల్లనివ్వాలి. ఆపై చేప ముక్కలను అందులో చేర్చి మూతపెట్టాలి. స్టౌను మంట తగ్గించి పది నిమిషాలు అలాగే వుంచాలి. చేప ముక్కలకు మసాలా బాగా పట్టాక.. పంచదార చేర్చి.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దించేయాలి. అంతే వెరైటీ ఆవనూనెతో ఫిష్ ఫ్రై రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments