మధుమేహాన్ని నివారించే పనీరుతో కట్ లెట్ ఎలా?

ముందుగా పనీరును తురుముకోవాలి. ఆలును ఉడికించి స్మాష్ చేసుకోవాలి. ఓ పాన్ తీసుకుని అందులో పనీరు తురుము, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:26 IST)
పనీర్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వున్నాయి. ఇవి కండరాలకు ఎంతో మేలు చేస్తుంది. మధుమేహాన్ని నివారించే పనీరును వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పనీరు పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఉపకరిస్తుంది. బరువు తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. కేశాలకు, చర్మ సౌందర్యానికి ఇదెంతో మేలు చేస్తుంది. అలాంటి పనీరుతో గ్రేవీలు చేసి బోర్ కొట్టేసిందా? అయితే వెరైటీగా కట్ లెట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పనీర్ - పావు కేజీ 
ఆలు - రెండు 
ఉల్లి తరుగు- అరకప్పు 
పచ్చిమిర్చి తరుగు- రెండు స్పూన్లు 
కొత్తిమీర తరుగు - పావు కప్పు 
బ్రెడ్ పొడి - ఒక కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీ స్పూన్ 
మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు, నూనె- తగినంత
 
తయారీ విధానం : 
ముందుగా పనీరును తురుముకోవాలి. ఆలును ఉడికించి స్మాష్ చేసుకోవాలి. ఓ పాన్ తీసుకుని అందులో పనీరు తురుము, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు పొడి, ఉప్పు చేర్చుకుని బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని కట్ లెట్ షేప్‌లో సిద్ధం చేసుకుని బ్రెడ్ పొడిలో ముంచి ప్లేటులోకి తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి వేడయ్యాక అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో కట్‌లెట్లను వేసి ఇరువైపులా దోరగా వేయించి సర్వ్ ప్లేటులోకి తీసుకోవాలి. టమోటా సాస్‌తో వీటిని నంజుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments