పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పనీర్ చికెన్ గ్రేవీ

ముందుగా పాన్ తీసుకుని అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కట్ చేసుకున్న పనీర్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన బెట్టుకోవాలి. అదే పాన్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు అర కప్పు చేర్చి

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (14:20 IST)
పనీర్‌లోని ప్రోటీన్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఎముకలకు, దంతాలకు మేలు చేస్తాయి. మాంసాహారంలోని ప్రోటీన్లకు సమమైన ప్రోటీన్లను ఇది అందిస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. అలాంటి పనీర్‌తో టేస్టీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు 
చికెన్ -  ఒక కేజీ 
పనీర్ - పావు కేజీ 
టమోటా గుజ్జు - ఒక కప్పు 
ఉల్లిపాయ గుజ్జు - ఒక కప్పు 
గరం మసాలా - ఒక టేబుల్ స్పూన్ 
కారం - రెండు టేబుల్ స్పూన్ 
నియాల పొడి - ఒక స్పూన్ 
పచ్చిమిర్చి - పది 
నూనె, ఉప్పు - తగినంత
నిమ్మరసం - మూడు టేబుల్ స్పూన్లు 
 
తయారీ విధానం : ముందుగా పాన్ తీసుకుని అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో కట్ చేసుకున్న పనీర్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన బెట్టుకోవాలి. అదే పాన్‌లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు అర కప్పు చేర్చి ఫ్రై చేసుకోవాలి.

బాగా వేగాక టమోటో, ఉల్లిపాయ గుజ్జు, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలి. ఆపై పనీర్ చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఇందులో ఉడికించిన చికెన్ ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు, నిమ్మరసం చేర్చాలి. బాగా ఫ్రై చేశాక దించేయాలి. అంతే పనీర్ చికెన్ గ్రేవీ రెడీ అయినట్లే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

గుజరాత్‌లో బాలికపై సామూహిక అత్యాచారం.. పొలాల్లోకి లాక్కెళ్లి ..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

తర్వాతి కథనం
Show comments