Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నాక్స్ కావాలంటూ పిల్లలు ఒకటే గోల కదూ... ఈ రిబ్బన్ పకోడీలు చేసిపెట్టండి...

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (18:01 IST)
సాధారణంగా పిల్లలు స్నాక్స్ అంటే ఎక్కువుగా ఇష్టపడతారు. స్కూల్ నుంచి ఇంటికి రావడంతోనే స్నాక్స్ కావాలని మారం చేస్తూ ఉంటారు. వారికి కావలసిన స్నాక్స్ పెట్టడం కోసంగా మనం బేకరీ ఐటమ్స్‌ను కొంటూ ఉంటాం. అవి ఆరోగ్యపరంగా అంత మంచివి కావు. అంతేకాకుండా అవి తరచూ తినడం వలన పిల్లలకు ఆకలి మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. 
 
కనుక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్స్‌ను మనం మన ఇంట్లోనే తయారుచేసుకొని పిల్లలకు పెట్టడం వలన వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా చిరుధాన్యాలతో చేసిన పిండి వంటకాలు పిల్లలకు మంచి శరీర పుష్టిని ఇవ్వడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. అటువంటి చిరుధాన్యాలలో ఒకటైన కొర్రలతో తయారుచేసే రిబ్బన్ పకోడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తయారు చేసుకోవడానికి పట్టే సమయం 30 నిమిషాలే. చూడండి.
 
కావలసిన పదార్ధాలు...
కొర్రపిండి- 1 కప్పు
శనగపిండి- 2 చెంచాలు
పుట్నాల పిండి- 2 చెంచాలు
వాము- అర చెంచా
కారం లేక మిరియాల పొడి- ఒక చెంచా
ఉప్పు- తగినంత
నూనె- వేపుడుకు సరిపడినంత
వెన్న లేక వేడి నూనె- 2 చెంచాలు
ఇంగువ- పావు చెంచా
 
తయారు చేయు విధానం-
ఒక గిన్నెలో కొర్ర పిండి తీసుకుని శనగపిండి, పుట్నాల పిండి, కారం, ఉప్పు వాము ఇంగువ, 2 చెంచాల వేడి నూనె వేసుకొని జంతికల పిండిలా కలుపుకోవాలి. బాణలిలో నూనె తీసుకొని జంతికల గిద్దలో రిబ్బన్ పకోడి చక్రం పెట్టుకొని పకోడి వత్తుకొని దోరగా రెండు వైపులా వత్తుకుంటే కరకర లాడే కొర్ర రిబ్బన్ పకోడి రడీ. దీనిని మరీ ఎక్కువ మంట, మరీ తక్కువ మంట కాకుండా మధ్యస్థమైన మంట మీద కాల్చుకోవాలి. మాడకుండా జాగ్రత్త పడాలి. కొర్రపిండి తయారుగా లేనప్పుడు కొర్రలు, శనగపప్పు, పుట్నాల పప్పు అన్నీ కలిపి దోరగా వేపుకొని పొడి చేసుకుని కూడా ఈ పకోడి తయారుచేసుకోవచ్చు. అన్ని రకాల చిరుధాన్యాలతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments