Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ పొటాటో ఫ్రై తయారీ విధానం...

బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను ఒక్కసారిగా అందిస్తాయి. కాబట్టి మోతాదుకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్

Webdunia
సోమవారం, 30 జులై 2018 (13:15 IST)
బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను ఒక్కసారిగా అందిస్తాయి. కాబట్టి మోతాదుకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి పొటాటోతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
బేబీ పొటాటోస్‌ - 12 
నూనె - సరిపడా
ఎండు మిర్చి - 1 
జీలకర్ర - 1 స్పూన్ 
కరివేపాకు - 4 రెబ్బలు 
ధనియాల పొడి - 1 స్పూన్ 
పసుపు - 1/2 స్పూన్ 
జీరా పొడి, కారం, గరం మసాల, ఆమ్‌చూర్‌ పొడి - 1 స్పున్స్ 
ఉప్పు - రుచికి తగినంత
నిమ్మరసం - స్పూన్స్ 
కొత్తిమీర తరుగు - పావు కప్పు
 
తయారీ విధానం:
ముందుగా బేబీ పొటాటోలను ఉడికించి చల్లారిన తరువాత తొక్క తీసి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను వేసి ఎండు మిర్చి, కరివేపాకు, జీలకర్ర వేగించాలి. ధనియాలపొడి, కారం, జీరాపొడి, గరం మసాల, ఆమ్‌చూర్‌, పసుపు, ఉప్పు వేసి చిన్నమంటపై మాడకుండా వేగించాలి. తరువాత బేబీ పొటాటోలను వేసి చిదిగిపోకుండా కలిపి 7 నిమిషాల పాటు అలానే ఉంచాలి. చివరగా నిమ్మరసాన్ని కలుపుకుని కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే వేడివేడి బేబీ పొటాటో ఫ్రై రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆటో నడుస్తుండగానే రిపీర్ చేశాడు.. వీడియో వైరల్ (video)

జగన్ - అదానీల విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలి : వైఎస్ షర్మిల

బోరుగడ్డ అనిల్‌ రాచమర్యాదలకు రూ.5 లక్షలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెట్‌ఫ్లిక్స్ సంస్థపై ధనుష్ కేసు.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

తర్వాతి కథనం
Show comments