Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ జానియర్‌ను ప్రారంభించిన జాక్&జోన్స్, వెరో మోడా, ఓన్లీ, సెలక్టెడ్‌ హోమ్‌

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (17:53 IST)
యూరోప్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ జాక్&జోన్స్, వెరో మోడా, ఓన్లీ, సెలక్టెడ్‌ హోమ్‌ దేశంలో తమ రిటెయిల్‌ ఉనికిని మరో మెట్టు పైకి తీసుకెళ్తూ హైదరాబాద్‌లో సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను ప్రారంభించాయి. వైవిధ్యభరితమైన అంతర్జాతీయ ఫ్యాషన్ స్టైల్స్, ప్రసిద్ధ హైస్ట్రీట్ ట్రెండ్స్‌ అందిస్తూ నగరంలోని ఫ్యాషన్ ప్రియుల అవసరాలను ఈ స్టోర్స్‌ తీర్చనుంది. మైమరపింపజేసే ఇన్-స్టోర్ షాపింగ్ అనుభూతులు అందిస్తూ ఈ స్టోర్ కొత్త తరం ఫ్యాషన్కోరుకునే వినియోగదారులు, నగరంలోని స్టైల్ ఔత్సాహికుల కోసం వన్‌-స్టాప్-షాప్‌గా ఇది నిలవనుంది.  
 
2 అంతస్తులు, 6500 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన ఈ స్టోర్‌ ఆధునిక స్త్రీ, పురుషులు ఎంచుకునేందుకు విస్తృతశ్రేణి స్టైలిష్ దుస్తులు అందిస్తుంది. ప్రతీ బ్రాండ్‌ విశిష్ఠ స్వభావాన్ని ప్రత్యేకంగా వెలికి తీసేందుకు ఇండోర్ ఫోలేజ్‌, అతి తక్కువ దృశ్యరూపకాలను ఉపయోగిస్తూ స్టోర్‌ డిజైన్‌ చేయడం జరిగింది. నేటి తరం టెక్‌ సావీ వినియోగదారుల ఇన్‌-స్టోర్‌ అనుభూతిని మరింత పెంచేందుకు ఆధునిక టెక్నాలజీ, సర్వీసులతో స్టోర్‌ సంసిద్ధంగా ఉంది.
 
గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఎంట్రీ లెవల్‌లో 2731 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జాక్‌ & జోన్స్‌లో పూర్తి శ్రేణి మెన్స్‌ వేర్‌తో పాటు తప్పనిసరిగా ఉండాల్సిన డెనిమ్వేర్‌, రోజు ధరించే దుస్తులు, నీట్ సూట్స్‌, అర్బన్ స్ట్రీట్‌వేర్ పీసెస్‌, యాక్సెసరీలు, స్నీకర్స్‌ చూడవచ్చు. నేటి తరం చురుకైన నగర పురుషులకు కావాల్సిన ఫ్యాషన్‌తో పూర్తి వార్డ్‌రోబ్‌ కలెక్షన్స్‌ను ఇక్కడ తిలకించవచ్చు. అలాగే 172 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న జాక్‌ & జోన్స్‌ జూనియర్‌లో ఫ్యాషన్‌ ఇష్టపడే పిల్లలతో పాటు 4-14 వయస్సు వరకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయి.
 
పురుషుల అంతర్జాతీయ బ్రాండ్‌-సెలక్టెడ్‌ హోమ్‌ స్టోర్‌ 704 చదరపు అడుగుల విస్త్రీర్ణంతో ఉంది. అద్భుతమైన టైలరింగ్ షార్ప్‌ సిల్హౌట్స్‌తో ఆధునిక వినియోగదారులకు ప్రత్యేకమైన స్టైల్‌, నైపుణ్యాన్ని అందిస్తుంది. సమకాలీన మహిళా దుస్తుల బ్రాండ్ వెరో మోడా రెండో అంతస్థులో చూడవచ్చు. 1175 చదరపు అడుగుల స్థలంలో విస్తరించిన ఈ స్టోర్‌ నేటి తరం మహిళల ఎంపిక కోసం పూర్తిస్థాయి వార్డ్‌రోబ్ - చిక్ క్యాజువల్‌వేర్, టైలర్డ్ సెమీ ఫార్మల్స్ నుంచి గ్లామరస్ పార్టీ వేర్ వరకు అన్ని అందిస్తుంది. చివరగా 1178 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఓన్లీ, అమ్మాయిల కోసం సరికొత్త ఫ్యాషన్ స్టైల్స్‌, లిమిటెడ్‌ ఎడిషన్‌ డ్రాప్స్‌, డెనిమ్‌ ఎసెన్షియల్స్‌తో పాటు సరికొత్త అథ్లెషియర్‌ స్టైల్స్‌ అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

"కల్కి 2898 AD": ప్రభాస్ జపాన్ స్కిల్స్ అదుర్స్.. వీడియో వైరల్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

తర్వాతి కథనం
Show comments