Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ పాలిష్ వాడితే.. బరువు పెరుగుతారట..?

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (13:01 IST)
ఇటీవలిమధ్యకాలంలో నెయిల్ ఆర్ట్‌కి బాగా క్రేజ్ పెరిగింది. రకరకాల నెయిల్ పాలిష్‌తో అమ్మాయిలు క్రియేటివిటిగా ఎన్నో డిజైన్స్‌ని వారి గోర్లపై వేసుకుంటూ ఫ్యాషన్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు. అయితే, ఇలాంటి వారందరికీ ఓ చేదువార్త.. అదేమిటంటే.. తరచు గోర్లరంగు వేసుకోవడం వలన బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. 
 
నెయిల్ పాలిష్.. అమ్మాయి గోర్లకు మరింత అందాన్నిచ్చే ప్రొడక్ట్. వీరికి ఒక్కసారి పాతది తీసేయడం.. కొత్తరంగును వేయడం.. మరి ఇంకా ఎక్కువగా మాట్లాడితే రోజుకో రంగు కూడా వేసేస్తామంటూ చూడచక్కని కలర్స్ పెయింట్స్‌ని తమ పొడవాటి నెయిల్స్‌పై వేసుకుంటుంటారు. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. 
 
ఎక్కువగా నెయిల్ పాలిష్ వాడడం వలన బరువు పెరుగుతారని పరిశోధనలో తేలింది. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనంతో నెయిల్ పాలిష్‌ని తయారుచేస్తారు. ఈ రసాయనం ప్లాస్టిక్, ఫామ్ ఫర్నీచర్‌కి మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయనాన్ని నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడుతారు. వీటిని వాడడం వలన మానవ హార్మోన్స్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా బరువు పెరుగుతారు. 
 
మార్కెట్స్‌లో దొరికే 3వేల రకాల నెయిల్ పాలిష్‌లపై జరిగిన పరిధోశనలో 49 శాతం నెయిల్ పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్ పాలిష్స్ పెట్టుకోవడం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని, వీటిని పెట్టుకున్న 10 నుండి 14 గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్టు నిపుణులు చెప్పారు. 
 
చర్మానికి అంటుకోకుండా గోళ్లరంగు వేసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు. ఆర్టిఫీషియల్ నెయిల్స్‌కి పెట్టుకుని అతికించుకోవడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏదేమైనా నెయిల్ పాలిష్ మాత్రం ఎక్కువగా ఉపయోగించకూడదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments