Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోళ్ళపై రకరకాల పూల డిజైనింగ్ ఎలా?

గోళ్ళు మన ఆరోగ్యానికి సూచికలు. చేతి గోళ్ళు, కాళ్ళ గోళ్ళలో మార్పులు ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని చూసిస్తాయి. గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబంగా చెబుతుంటారు.

Webdunia
బుధవారం, 10 అక్టోబరు 2018 (12:05 IST)
గోళ్ళు మన ఆరోగ్యానికి సూచికలు. చేతి గోళ్ళు, కాళ్ళ గోళ్ళలో మార్పులు ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని చూసిస్తాయి. గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబంగా చెబుతుంటారు. ఎందుకంటే గోళ్ళను చూసి మన ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. గోళ్లు పాలిపోయినట్లుగా ఉంటే రక్తహీనత, అదే గోళ్లు లేత గులాబీ రంగులో ఉంటే రక్తం తగినంత ఉందని అర్థం. అలాంటి గోళ్ళను కాన్వాసుగా మార్చుకోవడం ఎలాగో పరిశీలిద్ధాం.
 
నెయిల్‌ ఆర్ట్‌లో ప్రస్తుతం ఫ్లోరల్‌ డిజైన్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. నియోన్‌, కూల్‌ రంగుల నెయిల్‌ పాలిష్‌లను ఉపయోగించి గోళ్ళపై రకరకాల పూలను డిజైన్‌ చేసుకోవచ్చు. వ్యక్తిత్వం, మూడ్‌, వేడుకను బట్టి కూడా ఫ్లోరల్‌ డిజెన్లను గోళ్ళపై వేసుకోవచ్చు. మెనిక్యూర్‌ చేసిన తర్వాత గోళ్లను హైలైట్‌ చేస్తూ వాటిపై నచ్చిన పువ్వులను వేస్తే ఆ లుక్కే వేరు. అప్పుడు చేతికున్న పది వేళ్లు పది కాన్వాసులను తలపిస్తాయి.
 
* నెయిల్‌ ఆర్ట్‌లో డాటింగ్‌ టూల్స్‌ రకరకాల సైజుల్లో ఉంటే పువ్వులు మరింత క్లారిటీగా కనిపిస్తాయి. 
* ఒక గోరుపై పూలు వేయాలంటే చుక్కల కోసం చిన్న పిన్ను, స్లెండర్‌ డిజైన్‌ బ్రష్‌, మూడు నెయిల్‌ పాలిష్‌ రంగులు అవసరమవుతాయి.
* గోళ్లపై పువ్వుల డిజైన్లు వేయడానికి బద్ధకించే వారి కోసం మార్కెట్లో ఫ్లోరల్‌ స్టెన్సిల్స్‌ కూడా లభిస్తాయి.
* చెర్రీ బ్లజమ్‌, తులిప్స్‌, రోజ్‌... ఇలా ఏ పూలు వేయాలనుకుంటున్నారో ముందే ఊహించుకుని, వాటికి తగ్గ నెయిల్‌ పాలిష్‌ రంగులను ఎంపిక చేసుకోవాలి. 
* కాస్త ఓపిక ఉంటే, తప్పకుండా గోళ్లు పూల పరిమళంతో అందర్నీఆకట్టుకోవడం ఖాయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments