Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దీపావళికి మీరు అభిమానించేవారికి బాదములను బహుమతిగా ఇవ్వండి

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2020 (17:45 IST)
దీపావళి పండుగ సీజన్‌ మొదలైంది. మరికొద్ది రోజులలో దీపావళి పండుగ రాబోతుంది. మీరు చేయాల్సిన అంశాల జాబితాను అనుసరించడంతో పాటుగా మీ సామాజిక ఒప్పందాలు కూడా మీకు అస్సలు ఖాళీ లేకుండా చేస్తాయి. ఇంటిని అందంగా అలంకరించుకోవడం మొదలు పండుగ ఫుడ్‌ను తయారుచేయడం వరకూ, ప్రత్యేకమైన పూజా కీ థాలీ నుంచి లేదంటే మీ కుటుంబసభ్యులు మరియు స్నేహితులకు ఖచ్చితమైన బహుమతులను అన్వేషించడం.... ఇలా అనేక అంశాలపై మీరు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ప్రస్తుత మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం వేడుకలు భారీగా ఉండకపోవచ్చు. కానీ, కుటుంబ సభ్యులతో సంతోషం, ప్రేమను పంచుకునేందుకు దీపావళి ఇప్పటికీ అతి ముఖ్యమైన సందర్భంగానే నిలుస్తుంది.
 
ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ భద్రత మరియు ఆరోగ్యంపైనే అధికంగా దృష్టిసారిస్తున్నారు. మీరు అభిమానించే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతూ, ఈ మహమ్మారి సమయంలో వారి శ్రేయస్సుకు తగినట్లుగా బహుమతులు అందించే అవకాశం సైతం దీపావళి అందిస్తుంది. సాధారణ అవకాశాలకు బదులుగా మరింత ఆలోచనాత్మకంగా మరియు అర్థవంతమైన బహుమతులు అయినటువంటి చేతితో చేసిన దియాలు లేదా క్యాండిల్స్‌, డెకరేటివ్‌ ఉత్పత్తులు లేదా రీసైకిల్డ్‌ ఉత్పత్తులతో చేసిన వస్త్రాలు లేదా ఆరోగ్యవంతమైన, పోషకాహారాన్ని అందించే బాదములు ఏదైనా కావొచ్చు.
చక్కటి ఆరోగ్య బహుమతిగా బాదములు ప్రసిద్ధి. ఇవి విభిన్నమైన ప్రయోజనాలు అయినటువంటి గుండె ఆరోగ్యం, మధుమేహం మరియు బరువు నిర్వహణకు తోడ్పడతాయి. అదనంగా, బాదములు కాపర్‌, జింక్‌, ఫోలేట్‌, ఐరన్‌, విటమిన్‌ ఈ వంటివి అందిస్తాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక శక్తి మెరుగుపరచడంలో తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడమన్నది కుటుంబ ప్రాధాన్యతగా ఉన్న వేళ ఇంటిలో అందుబాటులో ఉంచుకోతగిన ఆరోగ్యవంతమైన ఆహారంగా బాదం నిలుస్తుంది.
 
అందువల్ల, ఈ సంవత్సరం సురక్షితమైన, ఆరోగ్యవంతమైనదీపావళి వేడుకలను సాధారణపండుగ శోభతో పాటుగా కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతూ చేసుకోండి. క్రాకర్లు కాల్చడం నిరోధించండి. వాటికి బదులుగా ఉల్లాసకరమైన దీపాలను అలంకరించండి, రంగోలీని అలంకరించి లక్ష్మీ దేవతను మీ ఇంటిలోకి మాత్రమే కాదు హృదయంలోనికీ ఆహ్వానించండి. కానీ ఇదంతా కూడా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూనే, భౌతిక దూరం ఆచరించడం ద్వారా చేయండి.
ఈ పండుగ సీజన్‌లో మీ ప్రియమైన వారి శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ఆవశ్యకతను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘పండుగలు వచ్చినప్పుడు మనలో చాలామంది తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ చూపడం కాస్త తగ్గుతుంది. అందువల్ల, ఈ దీపావళికి నేను మా సన్నిహితులకు బహుమతిగా అందించే అంశాల పట్ల మరింత అప్రమప్తత చూపుతున్నాను.
 
నా బహుమతుల జాబితాలో మొదటి అంశం ఖచ్చితంగా బాదము అవుతుంది. వీటిలో బీ2, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, ప్రొటీన్‌ మొదలైన వైవిధ్యమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి ఇవి అతి ముఖ్యమైనవి. చాలామందికి తెలియనిది ఏమిటంటే, రోగ నిరోధక శక్తికి మద్దతునందించే మరెన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఈ కారణం చేతనే బహుమతిగా బాదములను అందిస్తున్నాను’’ అని అన్నారు.
సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌ మరియు సెలబ్రిటీ మాస్టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, యాస్మిన్‌ కరావాలా మాట్లాడుతూ, ‘‘పండుగ సీజన్‌ అనగానే చవులూరించే ఆహారపదార్థాలూ అధికంగానే కనబడుతుంటాయి. ఈ కారణం చేతనే తీసుకునే కేలరీలపై హద్దులు కూడా చెరిగిపోతుంటాయి. చాలామంది పండుగ సమయాల్లో బరువు పెరగడం సహజంగానే కనిపిస్తుంటుంది. దీనిని అడ్డుకోవడానికి, మీ చుట్టూ ఎలాంటి అంశాలు ఉన్నప్పటికీ మీ రోజువారీ 30 నిమిషాల వ్యాయామం మిస్‌ కాకుండా ఉండాలి. దీనితో పాటుగా మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి పండుగ సమయంలో తీసుకునే ఆహారంపై పరిమితి విధించుకోవాలి.
 
పండుగ సీజన్‌లో దగ్గర ఉంచుకునేందుకు అత్యుత్తమ ఆహారంగా బాదములు నిలుస్తాయి. వీటిలో ఆకలి తీర్చే గుణం ఉండటంతో పాటుగా భోజనాల నడుమ సమయంలో తీసుకుంటే కడుపు నిండుగా ఉందన్న భావనను కూడా అందిస్తుంది. ఈ పండుగ సీజన్‌లో మరింత అర్ధవంతమైన ఆహారపు ఎంపికలను ఇది అందిస్తుంది. స్నేహితులు మరియు ప్రియమైన వారితో పంచుకునేందుకు ఇది అత్యుత్తమ బహుమతిగా కూడా నిలుస్తుంది’’ అని అన్నారు.
 
షీలా కృష్ణస్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుత మహమ్మారి కారణంగా, భారతదేశ వ్యాప్తంగా చాలా కుటుంబాలలో దీపావళి వేడుకలు గత సంవత్సరాలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. ఈ నూతన తరహా దీపావళి వేడుకలకు మనం సిద్ధమవుతున్న వేళ, బహుమతులను పంచుకోవడం- అది వర్ట్యువల్‌గా లేదా వ్యక్తిగతంగా పంచుకోవడం అనేది కొనసాగుతుంది. బాదములు లాంటి బహుమతులు పంచుకోవడమనేది దీర్ఘకాలంలో ఆలోచనాత్మకంగా మరియు సంరక్షణను అందించడానికి తోడ్పడుతుంది.
 
ఆ బహుమతులు అందుకున్న వారిలో ఆరోగ్యం పట్ల సానుకూలతను చూపుతుంది. మరీ ముఖ్యంగా గుండె ఆరోగ్యం కోసం ప్రాధాన్యత అందించే వారిలో ఇది వాస్తవంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఇటీవలి కాలంలో పరిశోధకులు వెల్లడించే దాని ప్రకారం, బాదములను తరచుగా తీసుకోవడం వల్ల గుండె వ్యాధులకు ప్రమాద కారకాలైనటువంటి టోటల్‌ మరియు ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గేందుకు సహాయపడుతుంది. అందువల్ల ఈ దీపావళికి బాదములను బహుమతిగా అందించడం తప్పనిసరి చేసుకోండి. దీర్ఘకాలపు ఆరోగ్యానికి మద్దతునివ్వండి’’ అని అన్నారు.
 
అందువల్ల, ఈ దీపావళికి నెయ్యిలో ముంచి తీసిన మరియు చక్కెర తియ్యదనాలను బహుమతిగా అందించడం బదులు ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నాయాలు అయినటువంటి బాదములు ఎంచుకోండి. ఇవి రుచికరంగా ఉండటమే కాదు కరకరలాడుతుంటాయి మరియు మంచి ఆరోగ్యానికి వాగ్ధానం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments