Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల మార్పిడి కేసు.. సినిమాలపై పిచ్చి.. విశాఖ సీఐ స్వర్ణలత ఖతర్నాక్

Webdunia
శనివారం, 8 జులై 2023 (09:56 IST)
Swarna latha
నోట్ల మార్పిడి కేసులో విశాఖ సీఐ స్వర్ణలతకు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్‌తో రూ. 12 లక్షలను సీఐ కొట్టేసినట్లు తేలింది. 
 
విశాఖపట్టణం నోట్ల మార్పిడి కేసులో ఇద్దరు వ్యక్తులను బెదిరించి రూ. 12 లక్షలు వసూలు చేసిన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతకు సినిమాలంటే పిచ్చి.
 
సినిమాలపై ఇష్టం పెంచుకున్న ఆమె ‘ఏపీ 31’ పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గానూ నటిస్తోంది. కొరియోగ్రాఫర్‌ను పెట్టుకుని శిక్షణ తీసుకుని.. ఇటీవల ఆమె చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగులు కొల్లి శ్రీను, శ్రీధర్‌లకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి.సూరిబాబు నోట్ల మార్పిడికి సంబంధించి ఆశ పెట్టాడు.
 
రూ. 90 లక్షల విలువైన రూ. 500 నోట్లు ఇస్తే  కోటి రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లు ఇస్తామని, దీంతో రూ. 10 లక్షలు మిగులుతుందని ఆశ చూపాడు.
 
తనకు రూ. 12 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తానని చెప్పడంతో అడిగినంతా ఇచ్చేసి వెళ్లిపోయారు. దీంతో 12 లక్షలు దోచేసిన సీఐపై దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments