Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జల మంత్రి పదవి ఎందుకు పోయిందో తెలుసా...?

మంత్రి బొజ్జల. వివాద రహితుడు. తెలుగుదేశంపార్టీ పాత కేబినెట్ లో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే. టిడిపి హయాంలో ఇచ్చిన శాఖ కూడా ఫారెస్ట్. శాఖల్లోను ఈ శాఖకు ఎంతో ముఖ్యమైనది. సిఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా కావడంతో ఆయనే ఏరికోరి మరీ బొజ్జలకు ఈ శాఖను కేటాయించా

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (10:53 IST)
మంత్రి బొజ్జల. వివాద రహితుడు. తెలుగుదేశంపార్టీ పాత కేబినెట్ లో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే. టిడిపి హయాంలో ఇచ్చిన శాఖ కూడా  ఫారెస్ట్. శాఖల్లోను ఈ శాఖకు ఎంతో ముఖ్యమైనది. సిఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా కావడంతో ఆయనే ఏరికోరి మరీ బొజ్జలకు ఈ శాఖను కేటాయించారు. అయితే గోపాలక్రిష్ణారెడ్డి   ఆరోగ్యం బాగా లేదు కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించామని అధిష్టానం చెబుతోంది. అసలు మంత్రి పదవికి పోవడానికి ప్రధాన కారణమేమిటో ఇప్పటికీ చాలామందికి తెలియదు. 
 
బొజ్జల భార్య బృందమ్మ. కుమారుడు సుధీర్ రెడ్డి. బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి మంత్రి పదవి అలంకరించినప్పటి నుంచీ వీరిదే హవా. ఆ పదవిని దుర్వినియోగం చేశారన్నది వీరిపై ఆరోపణ. ఏ పనినైనా సునాయాసంగా చేస్తూ అవితీని, అక్రమాలకు వీరిద్దరు పాల్పడ్డారని స్వయంగా టిడిపి నేతలే బాబు చెవిలో వేశారనే విమర్శలు కూడా వున్నాయి. కానీ బొజ్జల మాత్రం ఎలాంటి విషయాల్లో కలుగజేసుకోరు. 
 
ఆయన కుటుంబ సభ్యులే ఇవన్నీ చేస్తుంటారని బాబుకు చెప్పారు కొంతమంది నేతలు. దీంతో మంత్రి పదవి కాస్త ఊడిపోవడానికే అదే కారణమైంది. పెత్తనం మొత్తం భార్య, కొడుకు చేతిలో ఉంటే బొజ్జల ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం. అందుకే ఏ మాత్రం ఆలోచించుకుండా బొజ్జలను పీకిపడేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజా మాజీ మంత్రి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాబు వ్యవహారశైలిపై. 
 
ఎవరో చెప్పుడు మాటలు విని మంత్రి పదవి నుంచి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డిని తొలగించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. బాబు కూర్చున్న చెట్టును నరుక్కునే రకమని మండిపడ్డారు బొజ్జల సోదరుడు హరినాథరెడ్డి. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు బాబు నిరూపించగలడా అని సవాల్ కూడా విసిరారాయన. ఇప్పుడెవరు ఎన్ని సవాల్ లు ప్రతిసవాళ్ళు విసురుకున్నా పోవాల్సింది కాస్త పోయిన తరువాత ఎంత మాట్లాడినా ఏం లాభమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments