Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లిన హీరో... సాహసి... దర్శక నిర్మాత

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (07:24 IST)
తెలుగు చిత్రపరిశ్రమను మరో స్థాయికి తీసుకెళ్లి సాహసి సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు వారి జేమ్స్‌బాండ్‌గా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మన్యందొర వంటి సాహస పాత్రలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడని హీరో. ఇలాచెప్పుకుంటూ పోతే తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలు ఉప్పొంగేలా చేసిన ఎన్నో పాత్రల్లో ఆయన జీవించి ఆలరించారు. హీరో కృష్ణ ఒక కథానాయకుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, సాంకేతిక నిపుణుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించి, తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లిన ఘనడు. తెలుగు చిత్రసీమసో ఆయన సాధించిన ఘనతలను పరిశీలిస్తే, 
 
టాలీవుడ్‌లో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ పాత్రలను వేసిన హీరో కృష్ణనే కావడం గమనార్హం. ఈయన దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా భారీ హిట్స్ ఇచ్చిన దర్శక హీరో కృష్ణనే. 
 
మెగాఫోన్ పట్టి మొదటి చిత్రం "సింహాసనం"తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన హీరో. ఆ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే కోటిన్నర రూపాయలకు పైగా వసూళ్ళను సాధించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆయన దర్శకత్వం వహిస్తూ 'సింఘాసన్' అనే పేరుతో జితేంద్ర హీరోగా బాలీవుడ్‌లోకి రీమేక్ చేశారు. అది కూడా అక్కడ విజయఢంకా మోగించింది. 
 
'కలియుగ రాముడు, కొడుకు దిద్దిన కాపురం, రక్తతర్పణం' ఇలా 17 సినిమాలకు ఆయన తెరకెక్కించారు. పద్మాలయా స్టూడియోస్‌ను స్థాపించి ఆ బ్యానరుపై అనేక సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. వివిధ భాషల్లో దాదాపు 50కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే భారీ ప్రయోగం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
 
అదే "మోసగాళ్లకు మోసగాళ్లు" అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించారు. దీనికి ఆయన సోదరుడు జి.ఆదిశేషగిరి రావు నిర్మాతగా వ్యవహరించారు. ఇది తెలుగులో వచ్చిన తొలి కౌబాయ్ చిత్రం కావడం గమనార్హం. ఆ తర్వాత "దేవుడు చేసిన మనుషులు, సింహాసనం, ఈనాడు" వంటి భారీ హిట్స్ ఇచ్చారు. హిందీలో కూడా "హిమ్మత్‌వాలా, సింఘాసన్" వంటి ఘన విజయాలు అందుకున్నాయి. 
 
తమిళంలో జెమినీ గణేశన్‌తో "విశ్వరూపం", రజనీకాంత్‌తో "మావీరన్" వంటి చిత్రాలు నటించారు. నేటితరం హీరోలు ఒక యేడాదికి ఒక సినిమా తీయడమే గగనమైపోతున్న కాలంలో అపుడు కృష్ణ ఒక వైపు హీరోగా రాణిస్తూ యేడాదికి పదకిపైగా చిత్రాలు తీశారు. అందులో 1969లో రికార్డు స్థాయిలో 19 చిత్రాలు రిలీజ్ చేశారు. 1970లో 16 సినిమాలు చేస్తే, 1972లో 18 చిత్రాలు చేసి రికార్డు సృష్టించారు. ఇలా యేడాదికి సగటున పది నుంచి 12 చిత్రాలు చేసిన హీరోగా రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
 
అంతేకాకుండా, తెలుగు చిత్రపరిశ్రమకు సాంకేతిక హంగులు దిద్దింది కూడా హీరో కృష్ణనే కావడం గమనార్హం. 'అల్లూరి సీతారామరాజు'తో తొలి సినిమా స్కోప్ చిత్రాన్ని, 'సింహాసనం' చిత్రంతో తొలి 70 ఎంఎం స్కోప్ చిత్రాన్ని, తొలి జేమ్స్‌బాండ్‌గా 'గూఢచారి 116' చిత్రాన్ని, తొలి ఈస్ట్‌మన్ కలర్‌గా 'ఈనాడు' చిత్రాన్ని, తొలి డీటీఎస్ చిత్రంగా 'తెలుగు వీర లేవరా' చిత్రాన్ని నిర్మించి సరికొత్త హంగులను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ముఖ్యంగా, "అల్లూరి సీతారామరాజు" చిత్రంలో కృష్ణకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 
 
ఇలా సినీ కెరీర్‌లో హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. అలాగే, హీరోగా కృష్ణ దాదాపు 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా, ఏడు చిత్రాల్లో త్రిపాత్రిభినయం చేసి సరికొత్త రికార్డును సృష్టించారు. అంతేకుండా సినీ కెరీర్ ప్రారంభించిన కేవలం తొమ్మిదేళ్లలోనే ఏకంగా వంద చిత్రాల్లో నటించిన ఘనత ఆయనకే సొంతం.
 
అలాగే, కృష్ణ సినీ కెరీర్‌లో 110 మందికిపై దర్శకులతో పని చేయగా, సుమారుగా 80 మందికిపై హీరోయిన్లతో నటించారు. వీటిలో అత్యధికంగా విజయనిర్మలతో కలిసి 48 చిత్రాలు, జయప్రదతో 47 చిత్రాలు, శ్రీదేవితో 31, రాధతో 23 చిత్రాల్లో నటించి ఎవర్‌గ్రీన్ హీరో అనిపించుకున్నారు. అత్యధిక చిత్రాల్లో వెండితెరను షేర్ చేసుకున్న విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments