Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియాను గ్రోత్‌హబ్‌గా గుర్తించిన తర్వాత అమ్మకాల్లో స్కోడా ఆటో ఇండియా సరికొత్త రికార్డులు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (23:50 IST)
ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేయడం, నిరంతర విక్రయాల వృద్ధి మరియు వేగవంతమైన నెట్‌వర్క్‌ విస్తరణతో స్కోడా ఆటో ఇండియా దూసుకుపోతోంది.అన్నింటికి మించి భారతదేశాన్ని తమ యొక్క అభివృద్ధి సెంటర్‌గా స్కోడా ఆటో గుర్తించింది. అందుకే ఇక్కడ ఎక్కువ ఉత్పత్తులను లాంచ్‌ చేస్తోంది. వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందిస్తోంది.
 
మరోవైపు స్కోడా ఆటో ఇండియా 2022 చివరి త్రైమాసికాన్ని ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో.. అద్భుతమైన హిమాలయాల సానువుల వద్ద నిర్వహించింది.  భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ నిపుణులతో నిర్వహించిన ఈ అతిపెద్ద సమావేశంలో… భారతదేశంలోని తయారు చేసిన ఉత్పత్తుల విజయాలను పీక్-టు-పీక్ డ్రైవ్ ప్రదర్శించారు. స్కోడా ఆటో ఇండియా ఇటీవల నిర్వహించిన GNCAP క్రాష్ పరీక్షలలో కుషాక్‌ పూర్తి 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్‌లను కూడా సాధించినట్లు ఈ సమావేశం ప్రకటించింది.
 
ఈ సందర్భంగా స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శ్రీ పెట్ర్‌ సోల్క్‌ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “సాధారణంగా, మా సమావేశాలు అన్నీ మా ప్రధాన కార్యాలయం అయిన మ్లాడా బొలెస్లావు లోనే నిర్వహిస్తాం. అక్కడే మా సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తాము. ప్రపంచ వేదికపై తమను తాము నిరూపించుకున్న మన భారతదేశం-అభివృద్ధి చేసిన మరియు భారత్-నిర్మిత ఉత్పత్తులను ప్రదర్శించడానికి ప్రపంచాన్ని భారతదేశానికి ఆహ్వానించడం నాకు చాలా సంతోషాన్ని మరియు గర్వంగా ఉంది. స్కోడా ఆటో ఇండియాలో మనందరికీ భారతదేశం మరియు ప్రపంచంలోని నిపుణులతో మాట్లాడటం ఆనందగా ఉంది. మన ఇండియా 2.0 హీరోలు హిమాలయాలలోని అందమైన పర్వత ప్రాంతాలలో తమ ఎలిమెంట్‌లో ఉన్నారు. 2022 మాకు గొప్ప సంవత్సరం. మాకు లభించిన ప్రతిస్పందనతో, ఇదే ఉత్సాహంతో 2023ని మరింత ముందుకు తీసుకువెళ్లగలమన్న నమ్మకం మాకు ఉంది అని అన్నారు.
 
ఈ సమావేశంలో ఇండియా, జర్మనీ, స్లోవేకియా, ఐర్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, ఆస్ట్రియా మరియు చెక్ రిపబ్లిక్ వంటి దేశాల నుంచి ఆటోమొబైల్‌ నిపుణులు మరియు ఉత్సాహవంతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments