Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనాని గురించి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంచనా ఏంటో చూడండి..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (20:44 IST)
జనసేన గురించి, పవన్‌ కల్యాణ్‌ గురించి వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి ఎటువంటి అంచనా వుంది? ఆయన ఆ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు? జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలా వుంటుంది? తెలుగుదేశంతో కలిస్తే ఏమవుతుంది? ఇలాంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్దాం.
 
నేను మీకొక థియరీ చెబుతా.. పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడే అనుకో.. ఏమౌతుంది? లాస్ట్‌ టైం ఇదే చంద్రబాబుతో కలిసి పోటీ చేశాడు. నేను పూచీగా ఉన్నాను.. చంద్రబాబుకు ఓటెయ్యండని ఊరూరా తిరిగారు. ఇదే పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తి అంతగా తిరిగినందువల్ల ఆయన్ను ప్రేమించే ప్రతి ఒక్కరూ చంద్రబాబుకే ఓటు వేశారు. 
 
ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సపరేట్‌గా పోటీ చేస్తున్నాడంటే ఏం జరుగుతుంది? ఆ రోజు పవన్‌ కళ్యాణ్‌ను అభిమానించే వ్యక్తులే బహుశా పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ ఓటు వేసుకుంటారేమో.. అందులో కూడా బహుశా అందరూ వేయరేమో.. మెజార్టీ వాళ్లు వేస్తారేమో.. అప్పుడు ఓటు బ్యాంకు ఎవరిది తగ్గుతుంది? తగ్గేది చంద్రబాబు ఓటు బ్యాంకే తగ్గుతుంది కానీ మా ఓటు బ్యాంకు తగ్గే పరిస్థితి ఉండదు.
 
రెండో సినారియోకొస్తాం.. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తే ఏమి జరుగుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వస్తుంది? వైసిపికే. ఓటరు దగ్గర ఉన్న ఛాయిస్‌లు రెండే రెండు. అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో వ్యతిరేక ఓటు ఉందంటే.. చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు బిహేవ్‌ చేసినా అట్లానే బిహేవ్‌ చేస్తారు.
 
1994లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినప్పుడు 294 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి వచ్చింది 26 స్థానాలు మాత్రమే. అంటే లెస్‌ ద్యాన్‌ 10 పర్సెంట్‌. అదే రకంగా 2004లో టీడీపీ ఓడిపోయినప్పుడు టీడీపీకి వచ్చిన స్థానాలు 47. అంటే లెస్‌ ద్యాన్‌ 15 పర్సెంట్‌. ఉన్న స్థానాలకు 15 పర్సెంట్‌ స్థానాలు కూడా రాలేదు. ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు ఇలా రెండే రెండు నిలుస్తాయి. చంద్రబాబు నాయుడు, ఆయన కూటమితో భాగస్వాములుగా ఉన్న వారందరికీ కూడా డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్లిపోతారు అని విశ్లేషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments