పవన్ కళ్యాణ్ సంతకం ఫోర్జరీ.. సోషల్ మీడియాలో జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్

ఆదివారం, 6 జనవరి 2019 (19:31 IST)
పవన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్లు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 మంది అభ్యర్ధులను కొత్తవారికి కేటాయిస్తానంటూ పవన్ కళ్యాణ్ నిన్ననే ప్రకటించారు. అయితే తాజాగా  బెజవాడలో మూడు స్థానాలకు పార్టీ టికెట్లు కేటాయిస్తూ పవన్  ఉత్తర్వులు ఇచ్చినట్టు తయారుచేసిన నకలీ లెటర్ ప్యాడ్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
 
విజయవాడు పరిధిలోని మూడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేసినట్టు పోతిన వెంకట మహేష్ బాబుతో పాటు, పార్టీ సభ్యత్వం కూడా లేని మరో ఇద్దరు అభ్యర్ధుల పేర్లను పవన్ ఖరారు చేసినట్టు నకిలీ ప్రెస్ నోట్  సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. దీంతో నకిలీ లెటర్ హెడ్ విషయం పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నారు. 
 
నేడు బెజవాడ పోలీసులకు ఫోర్జరీ సహా పలు అంశాలపై ఫిర్యాదు చేయాలని లీగల్ సెల్ నేతలకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ఎన్నికల రంగంలోకి దిగకముందే జనసేనను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఫ్రెండ్ కోసం లింగమార్పిడితో పెళ్లి.. మూడు నెలలు కాపురం చేశాక...