Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ వల్ల తెలంగాణాలో రూ.10 వేల కోట్ల నష్టం.. ఎందుకు..?

నోట్ల రద్దు సామాన్యులపై ఎంత భారం పడిందో... ప్రభుత్వాలపై కూడా అంతే భారం పడిందట. ఒకటి రెండు కాదు వేల కోట్ల రూపాయలు. మొదట్లో పెద్దగా పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం.. ప్రస్తుతం అంత డబ్బును నష్టపోయామా అని

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (16:09 IST)
నోట్ల రద్దు సామాన్యులపై ఎంత భారం పడిందో... ప్రభుత్వాలపై కూడా అంతే భారం పడిందట. ఒకటి రెండు కాదు వేల కోట్ల రూపాయలు. మొదట్లో పెద్దగా పట్టించుకోని తెలంగాణా ప్రభుత్వం.. ప్రస్తుతం అంత డబ్బును నష్టపోయామా అని ముక్కున వేలేసుకుంటుందట... అసలు ఎంత నష్టపోయిందో.. ఏ విధంగా నష్టపోయిందో తెలుసుకుందామా...
 
తెలంగాణ ప్రభుత్వానికి నోట్ల రద్దు దెబ్బ గట్టిగానే తగులుతోంది. మొదట ఊహించినదానికన్నా మూడు రెట్లు అదికంగా రెవెన్యూ నష్టం జరిగినట్లు తాజాగా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణ వంటి శాఖల ద్వారా సుమారు 55 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆశించిన ప్రభుత్వానికి ఆశా భంగమే ఎదురవుతోంది. 45 వేల కోట్ల వరకు ఆదాయం రావచ్చని, దాంతో సుమారు పది వేల కోట్ల రూపాయల గ్యాప్ వస్తోందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నోట్ల రద్దును సమర్థిస్తూ మూడువేల కోట్ల రూపాయల లోటు వరకు ఉండవచ్చని అన్నారు.
 
కానీ అది రూ.10 వేల కోట్లకు వెళుతుండడంతో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను డిల్లీకి పంపించారు. జీఎస్టీ, ప్రభుత్వ స్కీములలో రావల్సిన బాకీలు సుమారు 16 వేల కోట్ల రూపాయలు సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కోరడానికి ఆయన వెళ్లారని అంటున్నారు. ప్రత్యేకించి వాణిజ్య పన్నుల శాఖలో ఇప్పటికి 11 వేల కోట్ల ఆదాయ లోటు ఉండగా, ఈ మూడు వారాలలో కొంత రావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో వెయ్యి కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments