Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డికి అదంటే చాలా ఇష్టమట..! ఏంటది..?

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలోనూ రాణించింది. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్‌ మూవీ క్రియేషన్‌ సంస్థ పేరుతో పలు చ

Webdunia
సోమవారం, 13 మార్చి 2017 (16:02 IST)
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ రాజకీయాల్లోనే కాకుండా సినీ రంగంలోనూ రాణించింది. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్‌ మూవీ క్రియేషన్‌ సంస్థ పేరుతో పలు చిత్రాలను రూపొందించారు. సుమన్‌ కథానాయకుడిగా పలు చిత్రాలను నిర్మించారు. భూమా నాగిరెడ్డి నిర్మాతగా ఊహ కథానాయికిగా ‘నా కూతురు’ అనే చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో నిర్మించారు. పలు చిత్రాలకు బయ్యర్లుగా వ్యవహరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ భూమా నాగిరెడ్డికి మంచి మిత్రులు. మోహన్‌బాబు కుటుంబంతో భూమా కుటుంబానికి ఎంతో ఆత్మీయానుబంధం ఉంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండే వారు.
 
భూమా నాగిరెడ్డికి మంత్రి కావాలని కోరిక ఉండేదని, అది నెరవేరకుండానే మృతిచెందారని ఆయన సన్నిహితులు, అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎప్పటికైనా మంత్రి అవ్వాలని ఆయన అనుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ విస్తరణలో భూమాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. 
 
ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో ఆయన పలుమార్లు భేటీ కావడం కూడా ఈ వార్తలకు వూతమిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతలోనే భూమా నాగిరెడ్డి మృతిచెందడతో ఆయన అనుచరులు షాక్‌ గురవుతున్నారు. మంత్రి కావాలన్న కోరిక తీరకుండానే తమ నేత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని కన్నీరు పెడుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments