Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ జీతం చూస్తే కళ్ళు తిరగాల్సిందే.. జయలలిత ఒక్కరూపాయి తీసుకునేవారు!

దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఇంతకీ ఆయన జీతం ఎంతో తెలుసా అక్షరాల నెలకు రూ.4,21,000. అయితే ఆర్థికంగా ఉన్నత రాష్ట్రం కావడంతో ఆ మాత్రం తీసుకుంటే తప్పేంటని తెరాస నేతలు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:22 IST)
దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లోనూ సీఎం కేసీఆర్ జీతమే టాప్. ఇంతకీ ఆయన జీతం ఎంతో తెలుసా అక్షరాల నెలకు రూ.4,21,000. అయితే ఆర్థికంగా ఉన్నత రాష్ట్రం కావడంతో ఆ మాత్రం తీసుకుంటే తప్పేంటని తెరాస నేతలు సమర్థించుకుంటున్నారు. 
 
అంతేకాకుండా ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలకు కూడా తక్కువేం చేయలేదు. వారికి కూడా నెలకు రూ.2,50,000 జీతం ఇస్తున్నారు. ఇలా ఇస్తూ దేశంలోని అందరి ఎమ్మెల్యేల కంటే టాప్‌లో వారిని నిలబెట్టారు. ఇక రెండు రాష్ట్రాల విభజనతో ఖజానా ఖాళీ అయ్యిందని చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తక్కువేమీ తీసుకోవట్లేదు. దేశంలో అధిక మొత్తంలో వేతనాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉండటం గమనార్హం. 
 
మొదటి స్థానం కేసీఆర్ ఆక్రమించగా, రెండో స్థానం ఉత్తరాఖండ్ సీఎం నెలకు రూ.2,50,000 చొప్పున జీతం తీసుకుంటున్నారు. మూడో స్థానంలో చంద్రబాబు రూ.2,40,000 తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏపీ ఎమ్మెల్యేలు కూడా నెలకు రూ.1,25,000 పుచ్చుకుంటున్నారు. ఇకపోతే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత ఒక్కరూపాయి తీసుకుంటుండగా, పశ్చిమ బెంగాల్ దీదీ  అసలు అది కూడా పుచ్చుకోవట్లేదట. ఈ రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా జీతాలు తక్కువగా తీసుకుంటూ ఆశ్చర్యం కలిగిస్తున్నారు.
 
ఇక ఇప్పుడు పలు రాష్ట్రాల సీఎంలు ఎమ్మెల్యేల నెల జీతాలు.
 
తెలంగాణ ముఖ్యమంత్రి 4,21,000, ఎమ్మెల్యేలు రూ.2,50,000
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రూ.2,50,000, ఎమ్మెల్యేలు రూ.1,25,000.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.2,40,000, ఎమ్మెల్యేలు రూ.1,25,000.
మధ్యప్రదేశ్‌  ముఖ్యమంత్రి రూ.2,00,000, ఎమ్మెల్యేలు రూ.1,10,000.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రూ.2,50,000, ఎమ్మెల్యేలు రూ.1,60,000
మహారాష్ట్ర ముఖ్యమంత్రి రూ.2,25,000, మంత్రులు రూ.2,05,000.
మంత్రులు రూ.2,05,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.1,70,000.
ఢిల్లీ ముఖ్యమంత్రి రూ.1,20,000 మంత్రులు రూ.1,20,000
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రూ.88,000.
మంత్రుల వేతనాలు రూ.3,20,000.
ఎమ్మెల్యేల వేతనాలు రూ.2,10,000లకు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది.
 
తమిళనాడు ముఖ్యమంత్రి (జయలలిత) రూ.1, ఎమ్మెల్యేలు రూ.55,000.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి రూ.0. ఎమ్మెల్యేలు రూ.42,000.
 
మొత్తానికి అత్యధిక జీతం తీసుకుంటున్న జాబితాలో సీఎం కేసిఆర్ రికార్డు కెక్కితే బెంగాల్ దీదీ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సీఎంగా పనిచేస్తూ తన జీతాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి వెచ్చిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments