Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి గొడవలే 'అతిలోక సుందరి' శ్రీదేవి మృతికి కారణమా?

బాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవిని మృతిపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె మరణం వెనుక మిస్టరీ దాగివుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఆమె ఆస్తి గొడవలకే బలయ్యారనే వాదన బలంగా వినిపిస్

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (08:05 IST)
బాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవిని మృతిపై వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె మరణం వెనుక మిస్టరీ దాగివుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఆమె ఆస్తి గొడవలకే బలయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది.  
 
దుబాయ్‌లో అభిజ్ఞవర్గాల సమాచారం మేరకు... మోహిత్‌ మార్వా- బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా తరపు బంధువు. మోనా 2012లోనే చనిపోయింది.. కానీ ఈ పెళ్లికి ఆమె తరపు వారంతా తరలి వచ్చారు. శ్రీదేవి కూడా భర్తను, చిన్న కూతురు ఖుషీని తీసుకెళ్లి పాల్గొంది.
 
అయితే పెళ్లిలో బోనీకపూర్‌ ఎక్కువగా వారితోనూ, మోనా పిల్లలు అర్జున్‌ కపూర్‌, అన్షులాలతో గడపడం శ్రీదేవికి నచ్చలేదు. ఆ విషయమే ఆమె బోనీని ప్రశ్నించినట్లు సమాచారం. దీనికి బోనీ సూటిగా బదులివ్వలేకపోయారు గానీ ఈ విషయం చిలికి చిలికి గాలివానలా మారినట్టు సమాచారం. 
 
ఆస్తిలో సగభాగం మొదటి భార్య సంతానానికి కూడా చెందితే తన బిడ్డల గతేం కాను అని శ్రీదేవి చాలా ఆందోళనపడ్డట్లు తెలుస్తోంది. 
తొలి భార్య పిల్లలతో బోనీ సఖ్యతపై శ్రీదేవి చాలా ఆగ్రహంగా స్పందించినట్లు, ఇది పెళ్లినాటి ప్రమాణాలకు విరుద్ధమని ఆమె గట్టిగా చెప్పినట్లూ తెలుస్తోంది.
 
బోనీ - మళ్లీ అర్జున్‌ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయపడుతూంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపింది. తెగ మథనపడిపోయింది. 
 
బోనీకి ఏమీ లేని స్థితిలో ఆమె ఆయనను పెళ్లి చేసుకుని తన ఆస్తినంతా ఆయన పరం చేసి జీవితం గడుపుతూ వచ్చింది. ఓ రకంగా ఇన్నేళ్లూ బోనీ అనుభవిస్తున్నదంతా శ్రీదేవి సంపాదించిన ఆస్తే. ఇపుడా ఆస్తిని బోనీ- తన తొలి భార్య పిల్లలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోడానికి శ్రీదేవి ఇష్టపడడం లేదు. జాహ్నవి, ఖుషీల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ఆరాటపడింది. జాహ్నవి తొలి సినిమా ధడక్‌ ను ఖరారు చేసి సెట్స్‌ దాకా తీసికెళ్లింది కూడా శ్రీదేవే.
 
ఆమె దుబాయ్‌లో ఉండిపోయిన కారణం .. మారుతున్న బోనీ వైఖరి గురించి ఆలోచించడానికేనని తెలుస్తోంది. ఆ తర్వాత దుబాయ్ నుంచి ముంబైకు వచ్చి... మళ్లీ భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు దుబాయ్ వెళ్లిన బోనీ కపూర్ నిజంగానే శ్రీదేవికే కాదు యావత్ ప్రపంచానికి తేరుకోలేని సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments