Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్యాలు మూడు... రెండు పూర్తి.. మూడో దానిపై దృష్టిపెట్టిన బీజేపీ!!

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:28 IST)
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినపుడు దాని లక్ష్యాలు మూడు. అందులో మొదటిది రామమందిర నిర్మాణం. రెండోది జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు. మూడోది యూనిఫాం సివిల్ కోడ్. అంటే అన్ని మతాలు, వర్గాలకు చెందిన వారికి ఒకే రకమైన చట్టాన్ని అమలు చేయడం. ఈ మూడింటిలో రెండు లక్ష్యాలను బీజేపీ పూర్తి చేసింది. ఇక మిగిలిన మూడో టార్గెట్‌పై కమలనాథులు దృష్టి కేంద్రీకరించారు. బీజేపీని దేశ రాజకీయాల్లో నిలబెట్టిన అంశాల్లో అయోధ్య రామ మందిరం అత్యంత ప్రధానమైనది. 
 
ఈ నేపథ్యంలో తాము అనుకున్న మూడు లక్ష్యాల్లో రెండు పూర్తికావడంతో కమలనాథులు ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో మూడో దానిపై దృష్టిపెట్టారు. అయితే, అది ఇప్పట్లో సాధ్యమా కాదా అన్నదికాలమే సమాధానం చెప్పాల్సివుంది. దేశ రాజకీయాల్లోకి బీజేపీ 1980లో ఆవిర్భించింది. ఆ పార్టీ ఆవిర్భవించిన నాలుగు దశాబ్దాల తర్వాత మూడు లక్ష్యాలు నెరవేరగా ఇపుడు ఆ పార్టీ లక్ష్యం యూనిఫాం సివిల్ కోడ్‌పై ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతున్న‌ది. 
 
అయితే, యూనిఫాం సివిల్ కోడ్ అమలు ఎలా సాధ్యమో ఓసారి పరిశీలిస్తే, యూనిఫాం సివిల్ కోడ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్టిక‌ల్ 44 ప్ర‌కారం పోరాటం చేయాల‌ని భార‌త రాజ్యాంగం సూచిస్తోంది. స‌ర్వ‌మ‌తాలు స‌మ్మ‌తం వ్య‌క్తం చేసే విధంగా చ‌ట్టాన్ని రూపొందించాల‌న్న‌దే యూనిఫాం సివిల్ కోడ్ ల‌క్ష్యం. అయితే ప్రస్తుతం అమల్లోవున్న హిందూ పర్సనల్ లా, ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా బోర్డులు వంటివి ఈ యూసీసీ కోడ్ బ్రేక్ వేస్తుంది. 
 
ఎందుకంటే చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే అన్న నినాదాన్ని అది వినిపిస్తుంది. పెళ్లి, వార‌సుల ఆస్తి, విడాకులు, మ‌త సంప్ర‌దాయాల వంటి అంశాల‌ను యూనిఫాం సివిల్ కోడ్ ప్ర‌క్షాళ‌న చేసే అవ‌కాశం ఉంది. నేరం విష‌యంలో మాత్రం భార‌త్‌లో యూనిఫాం సివిల్ కోడ్ ప్ర‌స్తుతం వ‌ర్తిస్తున్న‌ది.  ఆ ఆధారంగా మ‌న దేశం సెక్యూల‌ర్ అని చెప్పుకుంటున్నాం. 
 
కానీ, ఆస్తి, విడాకుల విష‌యంలో మాత్రం ఏక పౌర‌స్మృతి విధానం రావాల్సి ఉన్న‌ది. కుటుంబ చ‌ట్టాల‌ను సంస్క‌రించాల‌ని 2018లో కేంద్రం ఓ ప్ర‌తిపాద‌న తీసుకువ‌చ్చింది. అన్ని మ‌తాల మ‌హిళ‌ల‌కు న్యాయం చేయాల‌ని ఆ ప్ర‌తిపాద‌నలో పేర్కొన్నారు. ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు విష‌యంలో ముస్లింల నుంచి మంచి స్పందన వ‌చ్చింది, ఈ నేప‌థ్యంలో యూనిఫాం సివిల్ కోడ్‌కు కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇంది ఎంతవరకు సాధ్యమనేది కాలమే సమాధానం చెప్పాల్సి వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments