Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరును వణికిస్తున్న అక్రమ సంబంధాల హత్యలు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:26 IST)
అక్రమ సంబంధాల నేపధ్యంలో జరుగుతున్న హత్యలు గుంటూరును వణికిస్తున్నాయి. మిస్సింగ్ కేసులు, అనుమానాస్పద మృతి కేసులు, చివరకు హత్యలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవటానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. గుంటూరు జిల్లాను వరుస హత్యలు వణికిస్తున్నాయి.
 
వరుస పెట్టి హత్యలు జరుగుతుండటం, అవి కూడా అక్రమ సంబందాలు నేపధ్యంలోనే జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న పిడగురాళ్ళ పురుగు మందుల వ్యాపారి దారుణ హత్య, నిన్న చెరుకుపల్లిలో ఆర్ఎంపీ వైద్యుడి దారుణ హత్య, ఇప్పుడు ఒక మహిళా టీచర్ దారుణ హత్య.
 
అంతేకాదు మంగళగిరిలో భవనిర్మాణ పనులు చేసుకునే సీతారామంజనేయులు కూడా అక్రమ సంబంధం నేపధ్యంలోనే హత్యకు గురయ్యాడు. అంతేకాదు వేమూరు మండలం కుచ్చెళ్ళపాడుకు చెందిన వ్యవసాయ కూలి ప్రకాశరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంపై కూడా అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది.
 
భార్యే అక్రమ సంబంధం నేపధ్యంలో హత్య  చేయించిందని ఫిర్యాదు చేయటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఐదు హత్యలు, అవి కూడ అక్రమ సంబంధం నేపధ్యంలో జరిగినవిగా వెల్లడి కావటం సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments