Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ పార్టీ టిక్కెట్ కావాలంటే ఆషామాషీ కాదా? ఎంతో ఖర్చా? ఇది నిజమేనా?

జనసేన. ప్రస్తుతం రాజకీయాల్లో ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా అధికార, ప్రతిపక్ష నేతలకు మాత్రం ఈ పార్టీ పేరు వింటనే వెన్నులో వణుకు పుడుతోంది. కారణం.. ఆ పార్టీ చీఫ్ ఒక సినీ నటుడిది కావడమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (17:35 IST)
జనసేన. ప్రస్తుతం రాజకీయాల్లో ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా అధికార, ప్రతిపక్ష నేతలకు మాత్రం ఈ పార్టీ పేరు వింటనే వెన్నులో వణుకు పుడుతోంది. కారణం.. ఆ పార్టీ చీఫ్ ఒక సినీ నటుడిది కావడమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో నిలబడకపోయినా తెలుగుదేశం పార్టీకి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఆ తరువాత టిడిపి అధికారంలోకి వచ్చింది. 
 
అయితే ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ తెదేపాకు కూడా దూరమై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. స్వయంగా పవన్ కళ్యాణ్‌ అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించేశారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో యువతకే పెద్ద పీట వేస్తానని ప్రకటించాడు.
 
కానీ యువత అంటే సాధారణ యువత కాదు. డబ్బులు బాగా ఉన్న యువత అనే ప్రచారం మొదలైంది. డబ్బులిస్తేనే పార్టీలో సీటంట. అది కూడా పార్టీకి కాదు. తనని తాను గెలుచుకోవడానికి డబ్బులు ఖర్చుపెట్టుకోవాలట. ఒక్కో అభ్యర్థికి ఇప్పటికే రేట్లు కూడా పవన్ చెప్పేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకి ఒకరేటు, ఎంపికి ఒకరేటు. ప్రజలకు డబ్బులు పంచుతారో.. లేక ప్రచారానికి ఉపయోగించుకుంటారో మీ ఇష్టం.. అధికారంలోకి మాత్రం జనసేన రావాలన్నది పవన్ ఉద్దేశమట. 
 
ఇప్పటికే ప్రజారాజ్యంలో టిక్కెట్ల పందేరం పెద్ద దుమారం రేగి చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసింది. మరి ఇప్పుడు పవన్ కూడా అదే ఎలా చేస్తారబ్బా అని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఇలాంటి వాటికి పవన్ ఎంతో దూరమనీ, కష్టపడి పైసా డబ్బు తీసుకోకుండా ప్రజలకు సేవ చేసే వారి కోసమే ఆయన ఎదురుచూస్తున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో దిష్టిబమ్మ పోస్టర్ తో ఆది సాయికుమార్ భయపెట్టిస్తాడా !

ఇళయరాజా తో ఏదోజన్మలో పరిచయం.. అంటున్న కీరవాణి

వైవిధ్యమైన పాత్రలో రామ్ పోతినేని - మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌

రాజమౌళి స్పందన గురించి గేమ్ చేంజ‌ర్‌ చిత్ర యూనిట్ ఆసక్తి

నాని సినిమా హిట్ 3 కాశ్మీర్ లో షూటింగ్ - సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ మ్రుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments