Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

సెల్వి
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (13:10 IST)
India
2000 పుట్టగానే కలియుగం ముగుస్తుందని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ అలాంటిది ఏది జరగలేదు. ఎన్నో ప్రకృతీవైపరీత్యాలు ఏర్పడినా.. యుగాంతం జరగలేదు. కానీ విధ్వంసకరమైన ఘటనలు ప్రపంచ దేశాల్లో అక్కడక్కడా జరుగుతూనే వున్నాయి. అయితే తాజాగా ఓ భయంకరమైన వార్త ప్రజలను వణికిస్తోంది. 
 
2032 యుగాంతం కానుందని.. భారత్‌పై ఏకంగా 500 అణుబాంబుల వర్షం కురిస్తుందని ఓ వార్త భయాందోళనలను సృష్టిస్తోంది. డిసెంబర్ 22న యుగాంతం జరుగుతుందని కూడా ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ యుగాంతానికి ఓ ఉల్క కారణమవుతుందని వార్తలు వస్తున్నాయి. 
 
గంటకు 60వేల కిలోమీటర్ల వేగంతో ఒక భారీ ఉల్క భూమివైపు దూసుకొస్తోంది. ఈ ఉల్క ఎంత శక్తివంతమైందంటే.. ఒక పెద్ద నగరాన్ని క్షణాల్లో నాశనం చేయగలదు. ఈ ఉల్క భూమివైపుకు దూసుకురావడంపై అంతరిక్ష పరిశోధన సంస్థలన్నీ ఆందోళన చెందుతున్నాయి. 
 
ఈ ఉల్కకి 2024 YR4 అనే పేరు కూడా పెట్టేశారు. ఈ ఉల్క ప్రస్తుత స్థానాన్ని బట్టి ప్రమాద పటాన్ని నాసాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ రాంకిన్ అనే ఇంజనీర్ సిద్ధం చేశారు. దీనిని బట్టి భారతదేశంపై ఈ ఉల్క పడే అవకాశం వుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఉల్క ప్రభావం భారత్‌, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇథియోపియా, సూడాన్, నైజీరియా, కొలంబియా, ఈక్వెడార్ వంటి దేశాలపై వుండే అవకాశం వుంది. 
 
2032లో ఈ 2024 YR4 ఉల్క భూమిని ఢీకొడితే ఆఫ్రికా ఖండంలోకి ప్రాంతాలు, ఉత్తర, దక్షిణ అమెరికా నుంచి ఫసిఫిక్ సముద్రంపై ప్రభావం వుంటుంది. డిసెంబర్ 22, 2032న ఈ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం వుందని నాసా అంచనా వేస్తుంది. సముద్రంలోనే ఈ ఉల్క పడినా.. జనావాస ప్రాంతాల్లో ఎక్కడైనా పడితే మాత్రం భారీ విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఉల్క ప్రభావం 500 అణుబాంబులకు సమానం. ఇంకా 8 మెగాటన్నుల టీఎన్టీ పేలిన శక్తి విడుదలవుతుంది. ఇది హీరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే 500 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. దీనిని 2024 డిసెంబరులో గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments