Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ రాజకీయాల్లోకి వెళ్ళడం ఇష్టంలేని సన్నిహితుడు ఎవరో తెలుసా?

నర్రా శ్రీనివాస్ అంటే మనకు గుర్తుకు వచ్చేది 'గబ్బర్ సింగ్' సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ పక్కన నటించి తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు. నటనలో ఒక్కటే కాదు మంచితనంలో కూడా పవన్ కళ్యాణ్‌ వద్ద శ్రీనివాస్‌క

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (14:28 IST)
నర్రా శ్రీనివాస్ అంటే మనకు గుర్తుకు వచ్చేది 'గబ్బర్ సింగ్' సినిమా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ పక్కన నటించి తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు. నటనలో ఒక్కటే కాదు మంచితనంలో కూడా పవన్ కళ్యాణ్‌ వద్ద శ్రీనివాస్‌కు మంచి మార్కులే ఉన్నాయి. అందుకే పవన్‌కు అతి తక్కువ సమయంలో నర్రా శ్రీనివాస్ ఆప్తమిత్రుడు అయ్యాడు. వీరిద్దరు స్నేహితులు అయిన తర్వాత కమెడియన్‌గా శ్రీనివాస్‌కు మంచి అవకాశాలే వచ్చాయి. 
 
శ్రీనివాస్ నటన కన్నా పవన్‌తో ఉన్న సన్నిహితంతోనే కొన్ని కమెడియన్ క్యారెక్టర్లు వచ్చాయి. ఎప్పుడు, ఎక్కడ పవన్ షూటింగ్ జరిగినా పవన్ కళ్యాన్‌ వెంట నర్రా శ్రీనివాస్ ఖచ్చితంగా ఉంటారు. అంతటి స్నేహం వీరిద్దరిది. అయితే గత కొన్నిరోజులుగా రాజకీయంగా ప్రజలతో కలిసేందుకు పర్యటనలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌ వెంట మాత్రం శ్రీనివాస్ వెళ్ళలేదట. 
 
కారణం పవన్ వద్దన్నట్లు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. సినిమాల్లోకి తన స్నేహితులు కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళి తనతో పాటు తిరగడం పవన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే పవన్ కళ్యాణ్‌ నర్రా శ్రీనివాస్‌ను పక్కనబెట్టాడట. అయితే తాను సినిమాల్లో నటించనని, రాజకీయాల్లోనే ఉండిపోతానని ప్రకటించడంతో నర్రా శ్రీనివాస్‌కు చాలా బాధేసిందట. 
 
పవన్ కళ్యాణ్‌‌ను సినిమాలు చేయమని కోరారట నర్రా శ్రీనివాస్. అయితే తనకు ఇప్పుడు రాజకీయాలవైపు వెళ్ళడం అవసరమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాస్‌కు చెప్పి ఆ తర్వాత పర్యటనను ప్రారంభించారట. ప్రతిరోజు పవన్‌కు శ్రీనివాస్ ఫోన్ కూడా చేసి మాట్లాడుతున్నారట. స్నేహితులు చెప్పే సలహాలను ఎప్పుడూ స్వీకరించే పవన్ ఈ ఒక్క విషయంలో మాత్రం శ్రీనివాస్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments