Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శేషాచలం అడవుల్లో అలజడి .. పేలుడు పదార్థాలు స్వాధీనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవై ఉన్న శేషాచలం అడవుల్లో అర్థరాత్రి అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్‌కు పేలుడు పదార్థాలు కనిపించాయి. దీంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి పేలుడు పదార్థ

శేషాచలం అడవుల్లో అలజడి .. పేలుడు పదార్థాలు స్వాధీనం
, మంగళవారం, 30 జనవరి 2018 (14:22 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవై ఉన్న శేషాచలం అడవుల్లో అర్థరాత్రి అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్‌కు పేలుడు పదార్థాలు కనిపించాయి. దీంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి పేలుడు పదార్థాలు తీసుకొచ్చిన వ్యక్తుల కోసం అర్థరాత్రి అడవుల్లో జల్లెడ పట్టారు. అయితే ఎవరూ కనిపించకపోవడంతో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో కెసాసిటర్లు, కండెన్సర్లు, సర్య్కూట్‌లు ఉన్నాయి. వీటితో క్లైమోర్‌మెన్‌ను తయారుచేయవచ్చు అంటున్నారు టాస్క్ ఫోర్స్. 2003 అక్టోబర్ 1వ తేదీన అలిపిరి వద్ద చంద్రబాబునాయుడుపై జరిగిన బాంబు దాడిలో కూడా ఇలాంటి పరికరాలనే వాడి క్లైమోర్‌మెన్ పేలుడు పదార్థాలను తయారుచేశారు. 
 
శ్రీవారి మెట్టుసమీపంలో అందులోనూ భక్తులు తిరిగే ప్రాంతంలో ఈ పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీఐపీలను టార్గెట్ చేశారా.. లేకుంటే భక్తులను టార్గెట్ చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను ఇక్కడ అగంతకులు తీసుకువచ్చారా? అన్న కోణంలో టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్చితార్థం అయ్యింది... కానీ తేడాలు వచ్చాయి... అదే టెక్కీ హత్యకు కారణమా?