Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చేసుకోబోయే అమ్మాయి పేరు జనసేన.. ముహుర్తం 23న.. మాజీ సీఎం కిరణ్

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఖాయమైంది. ఉన్న పార్టీల కన్నా కొత్త పార్టీలో చేరడం మంచిదని, అందులోనూ కొత్త పార్టీలో ఒక వెలుగు వెలగ వచ్చని కిరణ్‌ అభిప్రాయం.

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (14:18 IST)
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్ళడం దాదాపు ఖాయమైంది. ఉన్న పార్టీల కన్నా కొత్త పార్టీలో చేరడం మంచిదని, అందులోనూ కొత్త పార్టీలో ఒక వెలుగు వెలగ వచ్చని కిరణ్‌ అభిప్రాయం. దీంతో పవన్‌తో సంప్రదింపులు కూడా జరిపేసినట్లు సమాచారం. కిరణ్‌ చేరిక ఎపుడో కాదు... అది కూడా అతి త్వరలోనే.
 
ఎన్నో యేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు కిరణ్‌ కుమార్‌ రెడ్డి. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లో కురు వృద్ధుడు రోశయ్యకు అవకాశం రావడం, రోశయ్య సీఎం పదవిని చేయలేక రాజీనామా చేయడం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నల్లారికి అవకాశం రావడం అన్నీ కూడా శరవేగంగా జరిగిపోయాయి. ఎలాగోలా సిఎం అయ్యారు కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
ఆ తర్వాత సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అది కాస్త బెడిసి కొట్టడంతో ఇక చేసేది లేక కిరణ్‌ రాజకీయాలకు దూరమై పోయారు. ఎక్కువగా బెంగుళూరులో తనకు ఉన్న ఆస్తులను కాపాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మళ్లీ వచ్చినట్లుంది. వెంటనే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయించారు.
 
మొదటగా అధికార పార్టీ బిజెపిలో చేరుదామని ఏకంగా అమిత్‌షా ముందుకు వెళ్లిపోయారు. రాజ్యసభ సీటుతో పాటు మంత్రి పదవి కావాలని డిమాండ్‌ ముందుంచారు. అయితే అమిత్‌షా ముందు ఓకే అన్నా ఆ తర్వాత కిరణ్‌ గురించి బిజెపి నాయకులు ఏం చెప్పారా ఏమో కానీ సైలెంట్‌ అయిపోయారు. దీంతో కిరణ్‌ చివరకు కాంగ్రెస్‌ పార్టీలో ఏఐసిసిలో కీలక పదవి కోసం రాహుల్‌గాంధీ వద్దకు వెళ్ళాడు. కాంగ్రెస్ సిఎంగా చేసేటప్పుడు రాహుల్‌గాంధీకి కిరణ్‌కు మంచి చనువు ఉండేది. ఆ చనువే కిరణ్‌ను చివరకు రాహుల్‌గాంధీని ఓకే అనేలా చేసింది.
 
ఇదంతాబాగానే ఉన్నా కాంగ్రెస్‌ పార్టీలో కిరణ్‌ చేరడం ఆయన సన్నిహితులకు ఇష్టం లేదు. దీంతో ఆ ప్రతిపాదన కాస్త మూలనపడిపోయింది. అయితే గత మూడురోజులుగా తన సొంత గ్రామం చిత్తూరుజిల్లా వాయల్పాడు నియోజకవర్గంలోని నగరిపల్లెలో తిరుగుతున్న కిరణ్‌ను చాలామంది సన్నిహితులు ప్రశ్నిస్తూ వచ్చారు. ఏ పార్టీ.. ఏ పార్టీ అంటూ ప్రశ్నించారు. దీంతో కిరణ్‌ తమాషాగా సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. పెళ్ళి ఓకే అయింది కానీ పెళ్ళి కూతురు ఎవరనేది రహస్యమని చెప్పుకొచ్చారు. అయితే ఆ పెళ్ళికూతురు ఎవరో కాదు జనసేన పార్టీ.
 
జనసేన పార్టీలో చేరడానికి అన్నీ సర్దుకున్నారు కిరణ్‌. పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాడటం, అందులోనూ పవన్‌ పార్టీ రాజకీయాల్లో నటించే అవకాశం రావడం ఇదంతా కిరణ్‌కు బాగా కలిసొచ్చింది. పవన్‌ కళ్యాణ్‌కు కిరణ్‌ ఎప్పటి నుంచో సన్నిహితుడు హైదరాబాద్‌లో కిరణ్‌ విద్యాభ్యాసం కొనసాగే సమయంలో పవన్‌తో అప్పట్లో మంచి పరిచయాలు ఉండేవి. ఆ పరిచయం కాస్త ఇప్పుడు ఉపయోగపడుతోంది. చివరకు పవన్‌తో అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఈనెల 23వతేదీన పార్టీలో చేరేందుకు సన్నద్ధమయ్యారట. మొత్తం మీద కిరణ్‌ రాకతో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments