తెలుగు కుబేరులు ఎవరు? టాప్-10 కుబేరులు వీరే

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (10:11 IST)
దేశంలో కుబేరుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ధనవంతులు అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా వెయ్యి కోట్లకు మించిన ఆస్తి గల కుబేరులు 78 మంది ఉన్న ఐఐఎఫ్ఎల్ వెల్త్ వెల్లడించింది. వీరి మొత్తం విలు రూ.3.90 లక్షల కోట్లకు పైగా ఉన్నట్టు తెలిపింది. ఇందులో రూ.56200 కోట్ల ఆస్తులతో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి కె.దివి మొదటి స్థానంలో ఉన్నారు. 
 
ఈ తెలుగు కుబేరుల ఆస్తి విలువ గత యేడాదితో పోల్చితే వీరి ఆస్తి విలువ 3 శాతం పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫార్మా రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆహార ప్రాసెసింగ్‌, నిర్మాణ రంగాల వారూ ఉన్నారు. 
 
హెటెరో ల్యాబ్స్‌కు చెందిన బి.పార్థసారధి రెడ్డి, ఆయన కుటుంబం రూ.39,200 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రూ.8,700 కోట్ల విలువైన ఆస్తులతో మహిమా దాట్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల్లోని సంపన్నుల్లో 64 మంది (82 శాతం) భాగ్య నగరికి చెందినవారే కావడం గమనార్హం. 
 
అలాగే, విశాఖపట్నం నుంచి ఐదుగురు, రంగారెడ్డి నుంచి ముగ్గురు ఉన్నారు. ఈసారి ఏపీ, తెలంగాణల నుంచి కొత్తగా 11 మంది జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి ఆయా వ్యక్తుల ఆస్తులను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించినట్లు సంస్థ తెలిపింది. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కుబేరుల్లో తొలి 10 మంది వివరాలను పరిశీలిస్తే, మురళి కె.దివ (దివిస్ లేబొరేటరీస్) సంపద విలువ రూ.56,200 కోట్లు, బి.పార్థసారథి కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రూ.39,200 కోట్లు, ఎం. సత్యనారాయణ రెడ్డి, కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబ్స్) రూ.16,000 కోట్లు, జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్) రూ.15,000, కోట్లు, రామేశ్వర రావు జూపల్లి, కుటుంబం (మై హోం ఇండస్ట్రీస్) రూ.13,300 కోట్లు, పి.పిచ్చరెడ్డి (మేఘా ఇంజనీరింగ్) రూ.12,600 కోట్లు, పీవీ కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్) రూ.12,100 కోట్లు, కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్) రూ.11,300 కోట్లు, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం (సువెన్ ఫార్మా) రూ.9,000 కోట్లు, మహిమా దాట్ల, కుటుంబం (బయోలాజికల్ ఇండియా లిమిటెడ్) రూ.8,700 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments