Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా.. రాహుల్‌కే ఆ బాధ్యతలు..?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తులు, ప్రచార కమిటీ బాధ్యతలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకే అప్పగించే దిశగా వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ

Webdunia
సోమవారం, 23 జులై 2018 (11:05 IST)
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎన్నికలకు సంబంధించి పొత్తులు, ప్రచార కమిటీ బాధ్యతలను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకే అప్పగించే దిశగా వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఏపీకి ప్రత్యేక హోదాపై కూడా కూలంకషంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ సర్కారుకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని స్పష్టం చేశారు. 
 
రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా నిర్వహించిన వర్కింగ్ కమిటీ సమావేశం ఉత్సాహంగా సాగింది. 23 మంది సభ్యులతో కూడిన కమిటీ వచ్చే సాధారణ ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలపై కూలంకుషంగా చర్చ జరిపారు. రాష్ట్రాలు, సాధారణ ఎన్నికల ఎజెండా, అనుసరించాల్సిన వ్యూహాలను ఈ భేటీలో ఖరారు చేశారు.
 
ముఖ్యంగా కేంద్రంలోని మోడీ సర్కారును ఎదుర్కొనేందుకు రాహుల్‌ నాయకత్వంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని తెలిపినట్లు వివరించారు. ఇందులో ప్రత్యేక హోదా అంశం కూడా వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments