Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ - ముంబైల మధ్య బుల్లెట్ రైల్ : డీపీఆర్‌కు ఆహ్వానం

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:25 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై - భాగ్యనగరం హైదరాబాద్‌ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య మొత్తం 711 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మార్గంలో బుల్లెట్ రైల్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (సమగ్ర ప్రాజెక్టు నివేదిక - డీపీఆర్) కోసం బిడ్లను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్) ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా, నవంబరు 5వ తేదీన ప్రీబిడ్ సమావేశాన్ని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించనుంది. 
 
ఈ సమావేశంలో బుల్లెట్ కారిడార్ మార్గానికి సంబంధించిన సమగ్ర సర్వే, ఉపరితల మార్గం, భూగర్భ మార్గం, సబ్‌స్టేషన్లు తదితర మార్గాలపై చర్చించనున్నారు. తద్వారా ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొదించనున్నట్టు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధి సుష్మా గౌర్ వివరాలను వెల్లడించారు. ఈ కారిడార్‌కు సంబంధించి నవంబరు 18వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. విజయవంతమైన బిడ్డరుకు టెండర్ ఖరారు చేయడం జరుగుతుందన్నారు. 
 
ఇటీవలే మరో ఏడు కారిడార్లలోనూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డీపీఆర్‌లను ఆహ్వానించింది. ఇందులో ఢిల్లీ టు అమృతసర్, అమృతసర్ టు చంఢీఘర్, ఢిల్లీ టు వారణాసి, ముంబై టు నాగ్‌పూర్, ఢిల్లీ టు అహ్మదాబాద్ కారిడార్లు ఉన్నాయి. వీటితో పాటే ముంబై టు పూణె, పూణె టు హైదరాబాద్ కారిడార్‌ను అభివృద్ధి చేయనుంది. చెన్నై టు మైసూర్, వారణాసి టు హౌరా మార్గాలకు ఇంకా టెండర్లు పిలవాల్సివుంది. 
 
ఈ బుల్లెట్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం, దూరం మరింత తగ్గుతుంది. తద్వారా వ్యాపార, వాణిజ్య రంగాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. 2028 నాటికి దేశంలో బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. తద్వారా రైల్వే రూపు రేఖలు మారిపోతాయని విశ్వసిస్తోంది. 
 
ప్రస్తుతం అహ్మదాబాద్ - ముంబై బుల్లెట్ రైల్ కారిడార్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 500 కిలోమీటర్ల ప్రయాణానికి 8 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం కేవలం 2 గంటల 7 నిమిషాలకు తగ్గిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments