Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రులకు జగన్ వార్నింగ్: తెరపైకి వైయస్ ఫార్ములా..!

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (18:39 IST)
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తవుతుంది. ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయానికి వెళ్లాలని సీఎం డిసైడ్ అయ్యారు. ఇందు కోసం స్థానిక సంస్థల ఎన్నికలను ముహూర్తం ఖరారు చేసారు. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే మంత్రులకు తన ఉద్దేశం ఏంటో ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తన ఆరు నెలల పరిపాలనకే కాదు.. మంత్రులుగా మీ భవిష్యత్తుకు నిర్ణయాత్మకంగా మారుతాయని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. 
 
ఇప్పటికే పలు మార్లు హెచ్చరించినా.. కొందరు మంత్రుల తీరులో మార్పు రావటం లేదని.. ఇన్‌ఛార్జ్ మంత్రులు.. జిల్లా మంత్రులు.. ఎమ్మెల్యేలతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో జడ్పీ సీటు కైవసం చేసుకోవాలని స్పష్టం చేసారు. ఏ మంత్రి అయినా ఉదాసీనంగా ఉంటే..ఏం జరుగుతుందో ..తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల తరువాత తీసుకున్న కీలక నిర్ణయాన్ని ప్రస్తావించటం ద్వారా తన ఆలోచన ఏంటనేది తేల్చి చెప్పేసారు.
 
1. పాలన మీద ప్రజాభిప్రాయం కోరుదాం.. 
ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావటం...స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా నిధులు మంజూరు చేయలేమని కేంద్ర స్పష్టం చేయటం.. ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించటంతో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసారు. దీని కోసమే అమ్మఒడి పధకాన్ని జనవరి 26 న ప్రారంభించాలని తొలుత అనుకున్నా.. దానిని జనవరి 9నే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ లోగానే వైయస్సార్ నవశకం ద్వారా ప్రతీ గడపకు ప్రభుత్వ పధకాలు అందాల్సిందేనని సీఎం స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఇది ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయమే కాదని..మంత్రుల భవిష్యత్ ఆధారపడిన అంశమని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
 
2. మంత్రులదే బాధ్యత.. ప్రతీ జిల్లాలోనూ.. 
ఇదే సమయంలో ప్రభుత్వ పధకాలను తొలి ఆరు నెలల్లోనే అమలు చేస్తున్న ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని.. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. రిజర్వేషన్ల ఆధారంగా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు..జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని సూచించారు. జనవరి నాటికి పోటీ చేసే అభ్యర్ధులు.. మండలాల వారీగా బాధ్యతలు..జిల్లా స్థాయిలో మంత్రులు... మొత్తంగా ఇన్ ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణతో ప్రతీ జిల్లాలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని.. దీనిని తిప్పికొడుతూ ప్రజలతో మమేకం కావాలన్నారు. అదే విధంగా.. ప్రభుత్వ పధకాల అమల్లో సాచురేషన్ విధానం అమలు చేస్తున్నామని.. ఇందులో గ్రామ సచివాలయలకు వచ్చే సమస్యలు..ప్రత్యేకంగా స్పందన మీద మంత్రులు సైతం ఫోకస్ చేయాలని సీఎం స్పష్టం చేసారు.
 
3. వైయస్సార్ ఫార్ములా అమలు తప్పదంటూ.. 
ఇదే సమయంలో.. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే రకంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలు చేసిన ఫార్ములాను సీఎం జగన్ కొందరు మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్నూలు.. పశ్చిమ గోదావరి జిల్లాల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. దీంతో.. కర్నూలు జిల్లా నుండి మంత్రి గా ఉన్న మారెప్ప.. పశ్చిమ గోదావరి జిల్లా నుండి అప్పుడు మంత్రిగా ఉన్న మాగంటి బాబును నాటి సీఎం వైయస్ మంత్రి పదవుల నుండి తప్పించారు. దీని ద్వారా పార్టీ గెలుపు విషయంలో తాను ఎంత ఖచ్చితంగా ఉంటానో స్పష్టం చేసారు. ఇప్పుడు జగన్ ఆ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా..మంత్రుల పదవుల కొనసాగింపు..స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు లింకు పెడుతూ ముఖ్యమంత్రి పరోక్షంగా తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పారు.
 
4. రెండున్నారేళ్లు మంత్రులుగా ఉండలేరు.. 
అధికారంలోకి వచ్చిన వెంటనే  కేబినెట్ కూర్పు సమయంలో ముఖ్యమంత్రి జగన్ అందిరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నానని.. రెండున్నారేళ్ల తరువాత ఇప్పుడు అవకాశం రాని వారికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసారు. దీంతో.. ఇప్పుడు ఉన్న మంత్రులు రెండున్నారేళ్లు కొనసాగుతారని అందరూ ధీమాగా ఉన్నారు. అయితే, తాజాగా ముఖ్యమంత్రి ఇదే అంశం మీద భిన్నంగా స్పందించారు. కొందరు మంత్రుల పని తీరులో ఎన్ని సార్లు చెప్పినా మార్పు కనిపించటం లేదని.. రెండున్నారేళ్లు కాదు.. ఆరు నెలల కాలంలోనే పదవులు ఉంటాయా లేదా అనేది అనుమానమే అనే విధంగా సంకేతాలిచ్చారు. ఇక, ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా మంత్రుల సమర్ధతకు..వారి పదవులకు సవాల్ గా నిలుస్తున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments