Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్‌లో నిద్రిస్తున్న విద్యార్థినిపై కాలేజీ ఛైర్మన్ లైంగిక దాడి.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 24 డిశెంబరు 2023 (14:57 IST)
తెలంగాణా రాష్ట్రంలో దారుణం జరిగింది. హాస్టల్‌లో నిద్రిస్తున్న విద్యార్థినిపై కాలేజీ ఛైర్మన్ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిన ఆ స్టూడెంట్ కేకలు వేయగా మిగతా విద్యార్థులంతా నిద్ర లేవడంతో వారిపై ఛైర్మన్ మండిపడ్డారు. అంతటితో ఆగ్రహంతో నిగ్రహించుకోలేక విద్యార్థినులపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ వారిని బెదిరించి వెళ్లిపోయాడు. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
బాధిత విద్యార్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భీమారంలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాలేజీ హాస్టల్‌లో మిగతా విద్యార్థులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రిస్తుండగా కాలేజీ ఛైర్మన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బూర సురేందర్ గౌడ్ వెళ్లాడు. 
 
విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడుతూ లైంగిక దాడికి ప్రయత్నించాడు. భయాందోళనకు గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో మిగతా విద్యార్థినులు నిద్రలేచి ఆ గదికి వచ్చారు. సురేందర్ గౌడ్ వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో తెల్లవారి వారు హాస్టల్ కు చేరుకున్నారు. 
 
కూతురితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే, సురేందర్ గౌడ్ అప్పటికే పరారయ్యాడని సమాచారం. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం