Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెన్షన్ డబ్బు కోసం భర్తను కిరాతకంగా హత్యాయత్నం భార్య.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2023 (13:36 IST)
పెన్షన్ డబ్బు కోసం కట్టుకున్న భర్తను ఓ కసాయి భార్య కిరాతకంగా చంపేసేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. అయితే, అదృష్టవశాత్తు ఆ బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
థానే జిల్లాలోని కళ్యాణ్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాధితుడిపై అతడి భార్య, నిందిత యువకులు ఇద్దరు దాడి చేశారు. అనంతరం మండే ద్రవాన్ని అతడిపై పోయగా భార్య నిప్పంటించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇరుగుపొరుగువారు మంటలు ఆర్పి బాధితుడిని హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
నెలవారీ పెన్షన్ విషయంలో భార్య తనతో గొడవ పడుతుండేదని, ఇద్దరు యువకులు తరచూ ఇంటికి వచ్చి వెళ్తుండడంపై తాను అభ్యంతరం తెలిపేవాడినని బాధితుడు చెప్పాడు. శుక్రవారం రాత్రి కూడా ఇలానే వాగ్వాదం జరిగిందని, ఇద్దరు యువకులు వచ్చి తనపై దాడి చేశారని చెప్పారు. 
 
మండే ద్రవాన్ని పోసి నిప్పు అంటించారని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు హాస్పిటల్లో చికిత్స పొందుతూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. హత్యాయత్నంలో పాల్గొన్న నిందిత యువకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు గతంలో ఒకసారి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో నిందిత యువకులు బాధితుడి కూతుళ్లలో ఒకరికి స్నేహితుడు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments