Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి స్నేహితులతో కలిసి భర్తను చంపేసి.. లవర్‌కు వీడియో కాల్ చేసి డెడ్‌బాడీని చూపిన భార్య!

ఠాగూర్
శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (17:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుర్హాన్‌పూర్‌లో విషాదకర ఘటన జరిగింది. ప్రియుడు స్నేహితులతో కలిసి కట్టుకున్న భర్తను భార్య మట్టుబెట్టింటింది. ఆ తర్వాత వీడియోకాల్ చేసి భర్త మృతదేహాన్ని బాయ్‌ఫ్రెండ్‌కు చూపించింది. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ - ఇచాపూర్ హైవేలోని ఐటీఐ కాలేజీల సమీపంలో బాధితుడు గోల్డెన్ పాండే అలియాస్ రాహుల్‌ను నిందితుడు 36 సార్లు కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 
 
బుర్హాన్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) దేవేంద్ర పాటిదార్ చెప్పిన వివరాల ప్రకారం... "నాలుగు నెలల క్రితం ఈ జంటకు వివాహమైంది. షాపింగ్‌కు వెళ్లిన దంపతులు మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్‌ వద్ద భోజనం చేశారు. ఆ తర్వాత ఇరువురు బైకుపై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో తన చెప్పు కింద పడిపోయిందని భార్య తన భర్తతో చెప్పింది. దీంతో పాండే బైక్ ఆపాడు. వెంటనే ఆమె ప్రియుడు యువరాజు స్నేహితులిద్దరూ పాండేను పగిలిన బీరు సీసాతో 36 సార్లు పొడిచారు. దాంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం తన భర్త మృతదేహాన్ని యువరాజుకు వీడియోకాల్‌లో భార్య చూపించింది. ఆ తర్వాత మృతదేహాన్ని సమీపంలోని పొలంలోని విసిరేసి నిందితులు అక్కడ నుంచి పారిపోయారు" ఎస్పీ పాటిదార్ చెప్పారు.
 
ఈ క్రమంలో ఆదివారం మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన రాహుల్ కుటుంబం, ఇంటి నుంచి బయటకు వెళ్లినపుడు అతను తన భార్యతో చివరిసారిగా కనిపించాడని చెప్పారని తెలిపారు. అదేసమయంలో అతని భార్య కనపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. బృందాలుగా ఏర్పడి వారి కోసం వేతికారు. మైనర్ భార్యతో పాటు ఆమె ప్రియుడు యువరాజు, అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు నేరాన్ని అంగీకరించారు. దాంతో ఈ నాలుగురిపై హత్య, హత్యకు కట్ర పన్నడం, ఆధారాలను దాచడం వంటి అభియోగాలు మోపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments