Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

ఐవీఆర్
శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (16:39 IST)
బాపట్ల రైల్వే స్టేషను సమీపంలో పట్టపగలే దారుణం జరిగింది. విశ్రాంత రైల్వే ఉద్యోగితో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్న మహిళ తనను దూరం పెడుతున్నాడంటూ తనపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. అలా మంటలతో సహా అతడిని వాటేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
బాపట్ల రైల్వే స్టేషను సమీపంలో విశ్రాంత ఉద్యోగి లక్ష్మీనారాయణ ప్రైవేట్ రిజర్వేషన్ కౌంటర్ నడుపుతున్నాడు. ఈయనతో ఓ మహిళ గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం వున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు మహిళ ఈరోజు మధ్యాహ్నం కౌంటరు వద్దకు వచ్చి నారాయణతో గొడవకు దిగింది. తనను ఎందుకు దూరం పెడుతున్నావంటూ నిలదీసింది. మాటామాటా పెరిగి చిన్న వాగ్వాదానికి దారి తీసింది. దీనితో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధిత మహిళ తన శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది.
 
అనంతరం మంటలు చెలరేగుతుండగా నాతోపాటే నీవు కూడా చద్దువుకాని రా అంటూ అతడిని వాటేసుకుంది. దీనితో ఇద్దరికీ మంటలు వ్యాపించాయి. నారాయణ తనను రక్షించాలంటూ కేకలు వేయడంతో స్థానికులు వెంటనే మంటలను ఆర్పేసారు. ఐతే బాధితురాలికి శరీరం 50 శాతానికి పైగా కాలిపోయినట్లు సమాచారం. నారాయణకు 30 శాతానికి పైగా శరీరం కాలినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments