Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

ఠాగూర్
బుధవారం, 16 జులై 2025 (13:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం మోగల్లులో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న మరో మహిళ తన బంధువులతో కలిసి ఈ దాడికి పాల్పడింది. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా బాధితురాలిని చెట్టుకు కట్టేసి చితకబాదింది. 
 
మంగళవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకూ దాడి కొనసాగింది. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన మహిళను, ఆమె బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బంధువులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..
 
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వానికే మచ్చతెచ్చే సంఘటన ఇది. దత్తత తీసుకున్న బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడ్డారు. దత్తత పేరుతో ఆ బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామానికి చెందిన ముల్లంగి నాగుల్ మీరాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె (17)ను దత్తత తీసుకునేందుకు కేశినేని రమేశ్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. దత్తత పేరుతో ఆ బాలికను తీసుకువెళ్లిన రమేశ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
 
ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి నాగుల్ మీరా విస్సన్నపేట పోలీస్ స్టేషనులో రమేశ్‌పై ఫిర్యాదు చేసింది. అబార్షన్ విషయం బయటపడటంతో బాలికను తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తర్వాత రమేశ్ ఇంటికి వచ్చి బాలికను బలవంతంగా ఖమ్మం నగరానికి తీసుకువెళ్లాడు. ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ప్రయత్నించినట్లు సమాచారం.
 
తమ కుమార్తెను తమకు అప్పగించాలని తల్లి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. బాలికను ఇంటి నుండి కిడ్నాప్ చేసిన రమేశ్ రెండు రోజులు తన వద్ద ఉంచుకుని, ఆ తర్వాత కానిస్టేబుల్ కృష్ణతో కలిసి పంపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. కారులో తన కుమార్తెను తరలిస్తుండగా, తల్లి నాగుల్ మీరా కారును ఆపి నిలదీసింది. ఈ వ్యవహారంపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం