Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలు మాట్లాడలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు..

Advertiesment
suicide

ఠాగూర్

, బుధవారం, 16 జులై 2025 (09:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ప్రియురాలు ఫోనులో మాట్లాడలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం రాజంపేట మండలం మన్నూరులో చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ (19) ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట రాజంపేట మన్నూరులో ఉంటూ మోటార్లకు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అతనికి వజ్రకరూరుకు మండలానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నారు. అయితే, కొన్ని రోజులుగా ఆమె మాట్లాడట్లేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఆమె వైపు నుంచి స్పంద లేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, మన్నూరులో నివాసం ఉంటున్న ఓ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య