Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితపై అత్యాచారం.. కామవాంఛ తీరాక పుస్తెల తాడు తెంచుకుని పారిపోయారు...

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (08:11 IST)
హైదరాబాద్ నగరంలో ఓ వివాహితపై ఇద్దరు దుండగులు అత్యాచానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడును తెంచుకుని పారిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 29 యేళ్ల వివాహిత గేటెడ్ కమ్యూనిటీలో పనిచేస్తుంది. ఆమె శుక్రవారం తన పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా, ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. తమ వద్ద పని వుందని నమ్మించి ఆమె ఫోను నంబరు తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున ఆమెకు ఫోన్ చేసి పని చేసి మాట్లాడాడు. 
 
అదేరోజు రోజు ఉదయం పనికి వెళుతుంటే కారు డ్రైవర్ శుభం శర్మ (29), ప్రైవేటు ఉద్యోగి సుమిత్ కుమార్ శర్మ (33)లతో కలిసి ఆమెను అనుసరించారు. మంచి పని ఇప్పిస్తామని చెబుతూనే ఆమె మెడపై కత్తి పెట్టి బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత మత్తుమందు కలిపిన పానీయాన్ని బలవంతంగా తాగించారు. దీంతో ఆమె సృహ కోల్పోయింది. 
 
కారును ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును తెంచుకుని పారిపోయారు. తమ కామవాంఛ తీరిన తర్వాత గండిపేట సమీపంలో వదిలి వెళ్లారు. స్పృహలోకి వచ్చిన తర్వాత  ఆమె తన భర్తకు, మేనమామకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్సింగి పోలీసులు కేసు నమోదుచేసి మొబైల్ నంబరు ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కారు, మొబైల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments