Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో వివాహిత ఐదురోజులు ట్రిప్ ప్లాన్, ఇంకాసేపట్లో బస్సు ఎక్కుతారనగా వచ్చేసాడు భర్త

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (18:36 IST)
అక్రమ సంబంధం ఎన్నో రోజులు దాగదన్నది అందరికీ తెలిసిందే. ఏదో ఒక సమయంలో ఎలాగోలా ఖచ్చితంగా తెలిసి తీరుతుంది. అలాంటిదే తెలంగాణా రాష్ట్రంలో జరిగింది. ఇద్దరు ఉన్నత విద్యావంతులు కామవాంఛ తీర్చుకోవడానికి పెడదారి పట్టారు. ఏకంగా ట్రిప్ పేరుతో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ అడ్డంగా దొరికిపోయారు.
 
నిజామాబాద్ పట్టణంలోని ఒక ప్రైవేటు స్కూల్ నిర్వహిస్తున్న మహిళకు స్థానికంగా ఉన్న ఎక్సైజ్ సిఐకు మధ్య పరిచయం ఏర్పడింది. స్నేహితుడి ద్వారా ఎక్సైజ్ సిఐకి మహిళతో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి తీసింది. గత సంవత్సరన్నరగా ఈ తంతు నడుస్తోంది.
 
అయితే కరోనా పుణ్యమా అని స్కూళ్లు లేకపోవడంతో పాపం ఎక్సైజ్ సిఐకు బాగా బోర్ కొట్టేసింది. ఆ వివాహిత కూడా సిఐ లేకుండా ఉండలేకుండా పోయింది. మళ్ళీ స్కూళ్ళు రీపెన్ చేయడంతో ఇక ఆ మహిళ సిఐతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంది. 
 
మైసూర్ లో ఐదురోజుల పాటు ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన వారికి ప్రత్యేక మెలుకువలు నేర్పిస్తున్నారని భర్తకు చెప్పింది. ఇక సిఐ అయితే ఐదురోజుల పాటు సెలవు పెట్టేశాడు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేసేందుకు బస్టాండ్ దగ్గరకు వెళ్ళారు. 
 
అయితే భార్యపై అనుమానంతో భర్త బస్టాండ్ కు వెళ్ళాడు. అక్కడ సిఐతో తన భార్య కలిసి ఉండడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. బంధువులకు ఫోన్ చేశాడు. సిఐను అక్కడే చితకబాదాడు. వ్యవహారం కాస్త పోలీస్టేషన్ వరకు వెళ్ళింది. అయితే ఫిర్యాదు ఎవరూ చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు కానీ ఎక్సైజ్ సిఐ వ్యవహారం మాత్రం నిజామాబాద్ పట్టణంలో చర్చకు కారణమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments