Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో వైకాపా నేతల వేధింపులకు వలంటీర్ ఆత్మహత్య

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (14:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార వైకాపా నేతల వేధింపులు తాళలక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు మృతుడు సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకున్నాడు. 
 
చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 11వ వార్డు పరిధిలోని జోగుల కాలనీలో ఉండే శరవణ అనే వలంటీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇదే వార్డుకు చెందిన వైకాపా నేత సయ్యద్ తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. 
 
సయ్యద్‌కు రూ.8.2 లక్షల మేరకు అప్పుగా ఇచ్చానని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే తాను వైకాపా ఎమ్మెల్యే మనిషినంటూ సయ్యద్ బెదిరిస్తున్నాడని తెలిపారు. పైగా, తీసుకున్న అప్పు చెల్లించకుండా మానసికంగా వేధించాడని, తనకు మరోమార్గం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టు పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ఈ కేసును స్థానిక పోలీసులు నీరుగార్చే ప్రయత్నాలు అపుడే మొదలుపెట్టారు. తన కుమారుడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక గాంధీ విగ్రహం కూడలిలో రాస్తారోకోకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments