Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (12:38 IST)
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా వదిలిపెడుతుంటారు. ఇలాంటి వారు తమకు తెలియకుండానే ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా ఏడేళ్ల బాలుడు వాటర్ వరల్డ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణంలో జరిగింది. 
 
నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆవరణలోని వాటర్ వరల్డ్‌లో రిషి (7) అనే ఏడేళ్ళ బాలుడు దిగడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు గుట్టుచప్పుడుకాకుండా ఆ బాలుడుని ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆస్పత్రికి వచ్చేలోపు రిషి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 
 
అయితే, మృతుడు తల్లిదండ్రులు మాత్రం మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. వాటర్ వరల్డ్‌లో తమ బిడ్డపడి మరణించాడని, దీనిని కప్పిపుచ్చేందుకు నిర్వాహకులు కుంటిసాకులు చెబుతున్నారని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... పోస్టుమార్టం కోసం రిషి మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరుక కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments