Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై దుండగుల మూక అత్యాచారం.. ఆ తర్వాత భర్తతో కలిసి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఇద్దరు దుండగులు ఓ మహిళపై సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటలకు ఆ ఆమె తన భర్తతో కలిసి విషం తీసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లాలో జరిగింది. ఈ కేసు వివారలను పరిశీలిస్తే, 
 
బస్తీ జిల్లాలో భార్యాభర్తలు ఉన్నారు. వీరిలో భర్తకు 30 యేళ్లు, భార్యకు 27 యేళ్లు. ఈ నెల 20వ తేదీ అర్థరాత్రి సమయంలో ఇద్దరు దుండగులు బాధితారులి ఇంట్లోకి చొరబడి భర్తను కట్టేసి, ఆయన కళ్లెదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే భర్తతో కలిసి భార్య విషం సేవించింది. వీరిలో భర్త అదే రోజు మరణించగా, బాధితురాలు మాత్రం గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది.
 
అయితే, వీరు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఓ వీడియోలో నిందితుల పేర్లను వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదర్శ్ (25), త్రిలోకి (45) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. అత్యాచారానికి, బాధితుల భూమి అమ్మకానికి సంబంధం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments