మాట వినని మూడేళ్ల కుమారుడు.. చావబాదిన తండ్రి... చిన్నారి మృతి.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (09:44 IST)
నిద్రలేచిన మూడేళ్ల కుమారుడు చెప్పిన మాట వినలేదన్న కోపంతో కన్నతండ్రి ఆ పసికందును చావబాదాడు. తండ్రి కొట్టిన దెబ్బలకు తాళలేక ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని అమీర్‌పేటలో జరిగింది. భార్యపై అనుమానంతోనే భర్త ఈ దారుణానికి తెగబడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని బూదూరు గ్రామానికి చెందిన లలితమ్మకు సి.బెళగల్ మండలం రంగాపురం చెందిన శివతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల ప్రణయ్, మూడేళ్ల సంజు, ఆరు నెలల పాప కూడా ఉంది. బతకుదెరువు కోసం వారు మహేశ్వరంలోని అమీర్‌పేటకు వచ్చారు. అక్కడే ఓ అద్ద ఇంటిలో ఉంటూ శివ మేస్త్రీ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం లలితమ్మ.. ఆరు నెలల పాపతో పాటు ప్రణయ్‌ను వెంటబెట్టుకుని కాయకూరలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. 
 
కాసేపటికి శివ ఇంటికి వచ్చి తలుపులు తీయగా సంజూ నిద్రలేచి ఏడుస్తూ బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతడిని ఎంత బుజ్జగించినా వినకపోవడంతో లోపలికి తీసుకొచ్చి తండ్రి శివ చావబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సంజును కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. దీంతో స్థానిక పోలీసులు సమాచారం అందుకుని శివను అదుపులోకి తీసుకున్నారు. భార్యపై అనునానంతోనే శివ ఈ దారుణానికి పాల్పడ్డాడని లలితమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments