Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నావద్దకు రాకు, ఒత్తిడి చేస్తే నా భర్తతో చెప్పి బెండ్ తీపిస్తానంటూ హెచ్చరించిన వివాహిత, ఐతే...

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (12:57 IST)
ఆమెకు పెళ్ళయ్యింది. పదేళ్ళ వయస్సున్న పిల్లలున్నారు. అన్యోన్యంగా సాగిపోతున్న కుటుంబం. కష్టపడి పనిచేసే భర్త. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం. అయితే అందులోకి ఉన్నట్లుండి ప్రవేశించాడు ఒక యువకుడు. వివాహితకు మాయమాటలు చెప్పాడు. ఆమెను లోబరుచుకున్నాడు. తాను చేస్తుంది తప్పని భావించిన ఆ వివాహిత యువకుడిని దూరంగా పెట్టేందుకు ప్రయత్నించింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది.

 
పుణేలోని లోహెగా ప్రాంతంలో నివాసముంటున్న గులాం షేక్ అనే యువకుడు ఇంటికి దగ్గరలోనే ఒక కుటుంబం నివసిస్తోంది. గులాం షేక్ రెండునెలల క్రితమే ఆ ప్రాంతానికి వచ్చాడు. సమీపంలోని ఒక మహిళతో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ఆమెకు వివాహమైన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

 
భర్త రైతు. ఉదయం వెళితే రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఇక పిల్లలు కూడా స్కూలుకు వెళితే సాయంత్రానికి వచ్చేవారు. ఈ యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఖాళీ సమయంలో పక్కనే ఉన్న వివాహితతో ముచ్చట్లు పెట్టుకునేవాడు. అలా ఆమెకు బాగా సన్నిహితంగా మెలుగుతూ ఆమెను లొంగదీసుకున్నాడు.

 
తను చేస్తోందని తప్పని నెలరోజుల్లోనే తెలుసుకుంది వివాహిత. ఆ యువకుడిని దూరం పెట్టాలనుకుంది. నా నుంచి దూరంగా ఉండు. నాకు పెళ్ళయ్యింది. ఇన్ని రోజులు నేను చేసిన తప్పును తెలుసుకున్నాను. నా భర్తకు అన్యాయం చేయలేనని ఆ వివాహిత చెబుతూ వచ్చింది. అయితే ఆ యువకుడు వినిపించుకోలేదు. తన కోర్కె తీర్చాలని వేధించడం మొదలుపట్టాడు. దాంతో ఆగ్రహానికి గురైన వివాహిత... అసలు విషయాన్ని చెప్పి తగిన శాస్తి చేయిస్తానని హెచ్చరించింది.

 
ఐతే వివాహిత తనకు దూరమైపోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. తన కోర్కె తీర్చని ఆమెను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. భర్తకు క్యారేజీ తీసుకుని వెళుతున్న వివాహితపై దాడి చేశాడు. రాళ్లతో కొట్టాడు. తలపై గట్టిగా తగలడంతో వివాహిత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. మేకల కాపరులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. గ్రామస్తుల ఫిర్యాదుతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments